జియో ఆప్టిక్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాణిజ్య సేవలు గురువారం నుంచి ప్రారంభమైనవి.జియో సంస్థ వాటి వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయి.  జియో ఫైబర్‌ ప్లాన్లను బ్రాంజ్‌, సిల్వర్‌, గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినమ్‌, టైటానియం కేటగిరీలుగా విభజించింది. కనీస ప్లాన్‌ ధర రూ.699 కాగా గరిష్ఠ నెలవారీ ధర రూ.8,499గా నిర్ణయించారు. కనీస ప్లాన్‌ రూ.699 ఎంచుకుంటే 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ+50జీబీ అదనపు డేటాను అందించనున్నారు. ఇందులోనే ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫరెన్సింగ్‌ సదుపాయాలు ఉంటాయి. 




రెండో ప్లాన్‌ ధర రూ.849. దీని వేగం 100 ఎంబీపీఎస్‌. 200జీబీ+200జీబీ అదనపు డేటాతో ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫరెన్సింగ్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. రూ.1,299 ప్లాన్‌తో 250 ఎంబీపీఎస్‌ వేగంతో డేటా పొందవచ్చు. ఇందులో 500జీబీ+250జీబీ అదనపు డేటా లభిస్తుంది. 500 ఎంబీపీఎస్‌ వేగం కావాలంటే రూ.2,499 ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఇందులో భాగంగా 1250జీబీ+250జీబీ అదనపు డేటా పొందవచ్చు. రూ.3,999 ప్లాన్‌తో 2,500 జీబీ, రూ.8,499 ప్లాన్‌తో 5 వేల జీబీల డేటా పొందొచ్చు.





ఈ రెండు ప్లాన్లలో డేటా వేగం 1 జీబీపీఎస్‌ ఉంటుంది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫెన్సింగ్‌ సదుపాయాలు ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఉంటాయి. జియో ఫరెవర్‌ వార్షిక ప్లాన్లను ఎంచుకొనే వినియోగదారులకు వెల్‌కమ్‌ ఆఫర్‌ను ప్రకటించారు. ఇందులో భాగంగా వినియోగదారులు జియో హోం గేట్‌వే, జియో 4 కె  సెట్‌టాప్‌ బాక్స్‌, టీవీ (గోల్డ్‌ ప్లాన్‌ లేదా అంతకంటే ఎక్కువ), ఓటీటీ యాప్స్‌ చందా వంటి వాటిని ఉచితంగా అందించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: