టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో... ఫైబర్‌ సేవల్లోకి అడుగుపెట్టింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్లాన్‌లను ప్రకటించింది. వెల్ కమ్ ఆఫర్‌ కింద.. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేకుండానే కనెక్షన్‌ ఇస్తుంది జియో.


భారత్‌లో జియో ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ హోం సొల్యూషన్ పొందనున్నారు. బేసిక్‌ స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ కాగా.. గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు బ్యాండ్‌ విడ్త్‌ను అందించనున్నట్లు తెలిపింది జియో. జియో ఫైబర్‌ బేసిక్‌ ప్లాన్‌ 699 రుపాలు. గరిష్టంగా 8, 499 రుపాయలుగా నిర్ణయించింది జియో. వినియోగదారులు 2500 చెల్లించి కనెక్షన్ పొందాల్సి ఉంటుంది. ఇందులో వెయ్యి రుపాయలు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు. మిగితా 1500 రుపాయలు సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంటుంది. 


బేసిక్ ప్లాన్‌ వినియోగదారులకు నెలకు100 జీబీ డెటా ఉచితంగా అందజేస్తారు. ఇందులో ఫ్రీ వాయిస్‌, వీడియో కాలింగ్‌తో పాటు హైస్పీడ్ గేమింగ్‌ను పొందనున్నారు కస్టమర్లు. నెలకు 849 చెల్లిస్తే 200 జీబీ డెటాతో పాటు ఇతర బెన్‌ఫిట్‌ను పొందనున్నారు. ప్లాటినం ఆఫర్‌లో భాగంగా 3,999 రుపాయలకు 2500 జీబీ డెటా ఉచితంగా వస్తుంది. ఇక టైటానియమ్‌ ప్లాన్‌లో 8499 రుపాయలకు 1GBPS స్పీడ్‌తో 5,000జీబీ డెటా ఇవ్వనుంది జియో. ప్లాటినమ్‌, టైటానియమ్‌ కస్టమర్లకు ప్రీమియం కంటెంట్‌తో పాటు వర్చువల్ రియాల్టీ ఎక్స్‌పీరియన్స్‌ను అదనంగా పొందనున్నారు. ఇక ఏడాది ప్లాన్‌ తీసుకునే కస్టమర్లకు జియో ఫైబర్‌ వెల్కమ్ ఆఫర్‌ కింద 4K సెటాప్‌ బాక్స్‌ను ఉచితంగా ఇవ్వనుంది. 


మొదటి దశలో జియో ఫైబర్ కనెక్షన్లు హైదరాబాద్, విశాఖ, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరుతో పాటు చాలా నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఐతే ప్రస్తుతానికి జియో ఫైబర్ ఇన్‌స్టాలేషన్, కనెక్షన్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రీపెయిడ్‌ సర్వీస్‌ ఇస్తున్నామని, త్వరలోనే పోస్ట్‌పెయిడ్‌ సేవలను అందిస్తామని వివరించింది జియో. 

మరింత సమాచారం తెలుసుకోండి: