Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:51 am IST

Menu &Sections

Search

అవే 'జియో గిగా ఫైబర్' కు పెద్ద దెబ్బేసాయి.....!!

అవే 'జియో గిగా ఫైబర్' కు పెద్ద దెబ్బేసాయి.....!!
అవే 'జియో గిగా ఫైబర్' కు పెద్ద దెబ్బేసాయి.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొన్నాళ్ల క్రితం వరకు ఒక జిబి మొబైల్ ఇంటర్నెట్ డేటాని దాదాపుగా రెండు నుండి మూడు వందల రూపాయలకు కొనుగోలు చేసిన మనము, నేడు అదే ఒక జిబి డేటాని ఒక రూపాయి కంటే తక్కువ ధరకు పొందగలుగుతున్నాం అంటే, అది నిజంగా రిలయన్స్ జియో రాక వల్లనే సాధ్యం అయిందని చెప్పవచ్చు. ఇక టెలికాం రంగంలోకి జియో రంగ ప్రవేశం తరువాత మిగతా ఆపరేటర్లు కూడా ధరలు తగ్గించి మెట్లు దిగిరాక తప్పలేదు. అయితే అంతటితో ఆగని జియో ప్రయాణం, ఆ తరువాత జియో గిగా ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, డిటిహెచ్, వాయిస్ కాలింగ్ వంటి మూడు సాకర్యాలను రాబోయే రోజుల్లో మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని, అప్పట్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పడం జరిగింది. ఇక చెప్పిన విధంగా సరిగా మూడేళ్ళ తరువాత ఇటీవల ఆగష్టు 12న జరిగిన వారి కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో జియో గిగా ఫైబర్ ను లాంచ్ చేసారు అంబానీ. అయితే వాటి పూర్తి వివరాలు మాత్రం సెప్టెంబర్ 5న ప్రకటిస్తామని ఆయన చెప్పడం, ఇక వారు చెప్పిన విధంగా మొన్న గిగా ఫైబర్ యొక్క ప్లాన్స్  వెల్లడించడం జరిగింది. 

అయితే అనుకున్న దొక్కటి, అయినది మరొక్కటి అనే చందాన, ఎప్పటినుండో జియో గిగా ఫైబర్ కోసం ఎదురుచూడ సాగిన లక్షలాది కస్టమర్లు, మొన్న ఆ సంస్థ ప్రకటించిన ప్లాన్స్ చూసి పూర్తిగా నీరు గారిపోయారు. అయితే అందుకు కొన్ని ముఖ్య కారణాలున్నాయి. ముందుగా జియో ఎంజీఎంలో చెప్పినట్లు బ్రాడ్ బ్యాండ్, డిటిహెచ్, వాయిస్ కాల్స్ వంటివి రూ. 700 మొదలు రూ. 10000 వరకు ఉంటాయని తెలిపారు అంబానీ. ఇక మొన్న ప్రకటించిన ప్లాన్స్ ప్రకారం రూ. 699, రూ. 849, రూ. 1299, రూ. 2499, రూ. 3999, రూ. 8499 గా ధరలు నిర్ణయించడం జరిగింది. అలానే వీటికి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం గా పేర్లు కూడా నిర్ణయించారు. ఇక ముందుగా గిగా ఫైబర్ ప్రకటన సమయంలో ఎవరైతే సంవత్సర చందా చెల్లించి గిగా ఫైబర్ సేవలు తీసుకుంటారో, అటువంటి వారికి 4కె డిజిటల్ స్మార్ట్ టీవీని ఉచితంగా అందిస్తాం అని అంబానీ ప్రకటించారు. కానీ ఈ ప్లాన్స్ లో కేవలం డైమండ్ ప్లాన్ కు పైబడిన ప్లాన్స్ ను తీసుకునే కస్టమర్స్ కు మాత్రమే ఈ సదుపాయం అందించనున్నారు. 

అదీకాక డైమండ్ ప్లాన్ వారు ఒకవేళ టివి తీసుకుందాం అని సిద్దమయినప్పటికీ, వారు రెండు సంవత్సరాల చందా ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరొకటి ఫస్ట్ డే ఫస్ట్ షో, ఇది కూడా డైమండ్ సర్వీస్ కు పైపడి ప్లాన్స్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ సర్వీస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేది మాత్రం రాబోవు ఏడాది ద్వితీయార్ధంలో అని అంబానీ తన ఎంజీఎంలో చెప్పారు. ఇకపోతే అన్నిటికంటే జియోకు బాగా దెబ్బేసిన అత్యంత ముఖ్యమైన రెండు అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది డిటిహెచ్ బాక్స్, మనం జియో వారి బ్రాంజ్ నుండి టైటానియం వరకు ఎటువంటి ప్లాన్ ఎంచుకున్నప్పటికీ మనకు బ్రాడ్ బ్యాండ్, డిటిహెచ్, వాయిస్ కాల్స్ వంటివి ఆయా ప్లాన్స్ ప్రకారం అందించడం జరుగుతుంది. అయితే ఇందులోనే అసలు మర్మం దాగి ఉంది, అదేమిటంటే, మనకు ఇచ్చే డిజిటల్ సెట్ టాప్ బాక్సు కేవలం హై ఎండ్ గేమ్స్ ఆడుకోవడానికి అలానే ప్లాన్స్  ను బట్టి ఓటిటి ప్లాట్ ఫామ్స్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్) లోని కార్యక్రమాలు వీక్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, మనం ఇంట్లో రోజువారీ చూసే ఛానల్స్ ఇందులో లభ్యం కావని సమాచారం, అయితే జియో వారి సావన్, జియో సినిమా వంటివి మాత్రం మనం ఎంచుకున్న ప్లాన్స్ ప్రకారం అందించడం జరుగుతుందట. 

ఇక మరొక ముఖ్యమైన అంశం ఇంటర్నెట్ స్పీడ్. ఇప్పటివరకు యాక్ట్, బిఎస్ఎన్ఎల్ వంటి బ్రాండ్ బ్యాండ్ ఆపరేటర్లు ప్రకటించిన ఇంటర్నెట్ టారిఫ్ ప్లాన్స్ తో పోలిస్తే, జియో ప్రకటించిన ఇంటర్నెట్ టారీఫ్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. సిల్వర్ ప్లాన్ నుండి టైటానియం వరకు కొంత లిమిటెడ్ గా మాత్రమే డేటాను అందించనుంది జియో, ఆపై ఆరు నెలల తరువాత ఆయా ప్లాన్స్ లో అదనంగా అందించే డేటా తగ్గపోనుందని ఆ సంస్థ తెలిపింది. ఇక ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబిపిఎస్ నుండి 1 జిబిపిఎస్ వరకు ఉంటుందని ప్రకటించిన జియో, మనం తీసుకున్న ప్లాన్స్ ప్రకారం డేటా అయిపోతే లభించే పోస్ట్ ఎఫ్యూపి, కేవలం 1 ఎంబిపిఎస్ గా ప్రకటించడం పై చాలామంది పెదవి విరుస్తున్నారు. కాబట్టి, ఈ విధమైన పలు రకాల లోపాల కారణంగా జియో గిగా ఫైబర్, సాధారణ మధ్యతరగతి వారి ఆశలకు చాలావరకు గండి కొట్టిందని, అయితే రాబోయే రోజుల్లో ప్లాన్స్ ను కొంత సవరించి కనుక అందించినట్లైతే జియోకు కస్టమర్లు కొంత ఆకర్షితులయ్యే అవకాశం ఉందని అంటున్నారు టెక్ నిపుణులు.....!! 


jio giga fiber plans gives big shock to the customers in india
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలకృష్ణతో 'ఐరన్ మ్యాన్' మూవీ.. మ్యాటర్ ఏంటంటే...??
'ఆర్ఆర్ఆర్' అప్ డేట్ : మరొక మూడురోజుల్లో టైటిల్ ప్రకటన...??
'జాన్' మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన పూజా హెగ్డే...!!
అమితాబ్ ఆరోగ్యంపై షాకింగ్ నిజాలు.. క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు....!!
ఎక్స్ క్లూజివ్ న్యూస్ : మెగాస్టార్ బయోపిక్ లో హీరో అతనే...??
బ్రేకింగ్ : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.....!!
మెగాస్టార్ 152 మూవీ టైటిల్ పై షాకింగ్ స్టేట్మెంట్.....!!
మహేష్, బన్నీ ల సినిమాలకు కీలకంగా మారనుంది వారేనా....??
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన పరుచూరి....!!
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విజయ్, కార్తీ....!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
మెగా మూవీలో నటించే ఛాన్స్ పట్టేసిందా....??
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.