ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం ఆన్లైన్ ఈ కామర్స్ వ్యాపారం ఊహకందని స్థాయిలో విస్తరిస్తూ ముందుకు పోతోంది. ఒకప్పుడు ఎక్కడో అక్కడక్కడా చాలా తక్కువ సంస్థలు మాత్రమే ఆన్లైన్ ద్వారా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవి. అయితే ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, ఈబే వంటి సంస్థల రాకతో ఆ తరహా ఈ కామర్స్ కార్యకలాపాలు మెలమెల్లగా ఊపందుకున్నాయి. నిజానికి ఒకప్పుడు ఏవో ఒకటి రెండు వస్తువులు మాత్రమే ఆన్లైన్ లో దొరికేవి, ఇక నేటి పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది. గుండు సూది దగ్గరి నుండి కారు వరకు, అదీ ఇదీ అని తేడా లేకుండా ప్రతిదీ మనకు ఆన్లైన్ లో లభ్యం అవుతున్నాయి. 

అయితే ఈ తరహా ఆన్లైన్ సంస్థలు, కస్టమర్లను తమవైపుకు తిప్పుకోవడానికి పలు రకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నాయి. ఇక వీటిలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఒకదానినొకటి పోటీ పడుతూ మరింత వేగంగా దూసుకెళ్తున్నాయి. ఇక ప్రతి ఏటా ఈ రెండు సంస్థలు బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో దసరా మరియు దీపావళి పండుగలను పురస్కరించుకుని నిర్వహించే సేల్స్ లో, పలు రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు మరియి గృహోపకరణాలు వంటి వాటిని 10 నుండి 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటిస్తూ, అతి తక్కువ ధరలకు కస్టమర్స్ కు విక్రయించడం జరుగుతోంది. ఇక ప్రతి ఏడు మాదిరి ఈ ఏడు కూడా ఆయా సంస్థల నుండి ఈ తరహా సేల్స్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, ఆ రెండు సంస్థలకు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) వారు పెద్ద షాక్ ఇచ్చారు. 

ఈ విధంగా ప్రతి ఏటా వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ వారు అతి తక్కువ ధరలకు వస్తువులు విక్రయించడం ద్వారా స్థానిక వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపించడం తోపాటు, విపణిలో వస్తువుల ధరల్లో తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతోందని, అలానే ఇది ఒకరకంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు పూర్తి విరుద్ధం అని, అందువలన ఈ తరహా సేల్స్ ని నిషేధించి తమకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్రానికి సీఏఐటి వారు ఒక లేఖ రాయడం జరిగింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుండి నిర్ణయం మాత్రం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇటువంటి సేల్స్, సీఏఐటి వారు చెప్పిన విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధలు విరుద్ధం అని తేలితే, వాటిపై నిషేధం కూడా వేసే అవకాశం లేదని అంటున్నారు మార్కెట్ నిపుణులు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: