పేమెంట్స్‌ బ్యాంక్‌లో తనదైన ముద్రవేసేందుకు కస్టమర్లను ఆకర్షించేపనిలో పడింది ఎయిర్‌టెల్.అందులో భాగంగా పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 6.5 లక్షలకు పైగా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ ఔట్‌లెట్స్‌లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంచింది.అంతేకాకుండా అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది.అలాగే గవర్నమెంట్ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్అకౌంట్‌కు పొందినా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.ఇక మార్కెట్‌ను బాగా విశ్లేషించి ఈ కొత్త సేవింగ్స్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.



ఈ సౌకర్యం ఆన్‌ బ్యాంక్‌,అండర్‌ బ్యాంక్‌ కస్టమర్ల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు పేర్కొంది.ఖాతాదారులు ఏవైనా ప్రభుత్వ రాయితీలు పొందే సందర్భం లో నగదును కూడా తిరిగి పొందవచ్చు అని తెలిపారు.ఇక భరోసా సేవింగ్స్‌ ఖాతా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని.ఈ పథకం ఆర్థికంగా వెనకబడిన వారి అవసరాలు ఎన్నో తీర్చడానికి ఉపయోగ పడుతుందని పేమెంట్ బ్యాంక్ ఎండీ అన్నారు.ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృత పరిశోధనల తర్వాత ఈ భరోసా సేవింగ్ అకౌంట్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.



ఈ ఖాతా వినియోగదార్లు దేశంలో ఉన్న ఏపీఎస్‌ అవుట్‌లెట్లలో నగదు తనిఖీలు, ఉపసంహరణలు చేసుకోవచ్చని ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఎండీ అనుబ్రాతాబిస్వాస్ తెలిపారు.ఇక ఈ బ్యాంకులో సేవింగ్స్అకౌంట్ ప్రారంభిస్తే ఉచితంగానే రూ.5లక్షల యాక్సిడెంట్ కవరేజ్ లభిస్తుందని.అయితే అకౌంట్‌లో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ కలిగిన ఖాతాదారులు మాత్రమే వ్యక్తిగత ప్రమాద  బీమాకి అర్హులవుతారని వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుందని,ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఎండీ అనుబ్రాతా బిస్వాస్‌ తెలిపారు.అంతే కాకుండా,నెలకు ఒకసారైన డెబిట్ కార్డుతో లావాదేవీ తప్పక నిర్వహిస్తూ ఉండాలని పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: