Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 6:54 am IST

Menu &Sections

Search

సూపర్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొనేముందు ఈ లేబుల్స్‌ను ఎప్పుడైన గ‌మ‌నించారా..?

సూపర్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొనేముందు ఈ లేబుల్స్‌ను ఎప్పుడైన గ‌మ‌నించారా..?
సూపర్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొనేముందు ఈ లేబుల్స్‌ను ఎప్పుడైన గ‌మ‌నించారా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ మార్కెట్లో అమ్మే పళ్లు, కాయగూరలను గమనిస్తే వాటిపై ఏవో లేబుల్స్ అతికించి ఉంటాయి. కానీ చాలామంది వాటి గురించి పెద్దగా పట్టించుకొని ఉండరు. ఆ లేబుల్... ఉత్పత్తి చేసేవాడికి, అమ్మేవాడికి మాత్రమే సంబంధించిన విషయంగా భావిస్తుంటారరు. కానీ నిజానికి లేబుల్ వినియోగదారుడు తను కొంటున్న వస్తువు ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉద్దేశించినది.

ప్రస్తుతం ఎక్కడ ఎవరి నోట విన్నా ఆర్గానిక్ అనే మాట వినిపిస్తోంది. ఆర్గానిక్ కాయగూరలు, పళ్లు అంటే సేంద్రీయ ఎరువులు వేసి సహజ పద్ధతుల్లో పండించినవని మనకు తెలుసు. అందుకే అవి ఆరోగ్యానికి మంచివని కొంచెం ఖరీదు ఎక్కువైనా  కొనుగోలు చేస్తుంటాం. ముఖ్యంగా పళ్ల రసాలకి ఆర్గానిక్ పళ్లే దిక్కు. ఎందుకంటే పళ్లరసాలు త్వరగా జీర్ణమై మన శరీరంలో కలిసిపోతాయి. ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. ఆ పళ్లరసం పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వేసి, రసాయనిక ఎరువులు వాడి పండించిన పళ్లనుంచి తయారు చేసిన‌ట్ల‌యితే... పళ్లరసం తీసుకున్న వెంటనే విష పదార్థాలు నేరుగా మన శరీరంలో కలిసిపోతాయి. దానివల్ల అప్పటికప్పుడు ఆరోగ్యం పాడు కావడంతో పాటు... భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.

What do Labels On Fruit Mean ?

మరి ఏవి సహజ పద్ధతుల్లో పండించినవి?
ఏవి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వేసి పండించినవి? ఏవి జన్యుమార్పిడి ద్వారా పండించినవి?... అని తెలుసుకోవాలంటే పళ్ళు, కాయగూరలపై వేసే లేబుల్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి.

ఆపిల్స్‌కు ఉన్న‌ఉన్న లేబుల్స్‌పై నాలుగు అంకెలు ఉండి, మొదటి అంకె మూడు లేదా నాలుగు ఉంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంట అని తెలుసుకోవాలి.

అదే లేబుల్స్‌పైన అయిదు అంకెలు ఉండి... మొదటి అంకె ఎనిమిది అయితే జన్యుమార్పిడి ద్వారా పండించిన పంట అని గుర్తించుకోవాలి. లేబుల్స్‌పై అయిదు అంకెలు ఉండి... మొదటి అంకె తొమ్మిది ఉన్నట్లయితే అది ఆర్గానిక్ పంట అని గుర్తించాలి.

ఇక పళ్లపై ఉన్న‌న లేబుల్స్‌ల‌ను పిల్లలు చూసుకోకుండా తినేస్తే గాభరా పడాల్సిన అవసరం లేనేలేదు. ఆ లేబుల్ కాగితాన్ని తినదగిన పేపర్‌తోనే తయారు చేస్తారు. అంతేకాదు.. ఆ లేబుళ్ల‌ను అతికించడానికి ఉపయోగించే జిగురు సైతం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతోనే తయారవుతుందట‌.

What do Labels On Fruit Mean ?



What do Labels On Fruit Mean ?
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.