బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధర పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ మార్కెట్ లో సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 155 రూపాయలు తగ్గి 39,305 రూపాయలకు దిగొచ్చింది. బంగారం ధర భారీగా తగ్గటానికి దేశంలోని స్థానిక నగల వ్యాపారుల నుండి కొనుగోళ్లు తగ్గటం మరియు మరియు బంగారానికి గతంతో పోలిస్తే డిమాండ్ కూడా భారీగా తగ్గటం కారణమని తెలుస్తోంది. 
 
22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా 150 రూపాయలు తగ్గటంతో బంగారం ధర 36,030 రూపాయలకు దిగొచ్చింది. మరోవైపు వెండి ధర కూడా బులియన్ మార్కెట్లో భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా 1,575 రూపాయలు తగ్గింది. ఇప్పుడు కేజీ వెండి ధర 48,500 రూపాయలకు దిగొచ్చింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 
 
0.80 శాతం తగ్గి ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1,494.25 డాలర్లకు క్షీణించింది. 1.98 శాతం తగ్గుదలతో వెండిధర 17.30 డాలర్లకు క్షీణించింది. వెండి, బంగారం తగ్గటానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ధరలు భారీగా తగ్గటంపై బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధర తగ్గటం పసిడి ప్రియులకు ఎంతో ఊరటనిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ఉండటంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: