ప్రస్తుత, భావి కస్టమర్లకు  అవగాహన కల్పించేందుకు  బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ జోన్ రెండు రోజుల పాటు  కస్టమర్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుంది.  క్టోబర్ 4 , 5 తేదీలలో హైదరాబాద్  బంజారా హిల్స్  రోడ్ నెంబర్  1  లోని ఖాజా మాన్షన్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహించనున్నారు. 400 జిల్లాల్లో రెండు దశల్లో బ్యాంకింగ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను నిర్వహించే విధంగా  ఎస్ బి ఐ కార్యాచరణ ప్రణాలికను రూపొందించింది. ఈ కార్యక్రమంలో ఎన్‌బిఎఫ్‌సిలు, ఎంఎఫ్‌ఐలు, ఎస్‌హెచ్‌జిలు, ఎంఎస్‌ఎంఇలు, ముద్ర, రిటైల్ తో పాటు అగ్రి-క్లయింట్లు కూడా పాల్గొనున్నారు.



పిఎస్‌బిల సామర్థ్యం, నిజ ఆర్థిక వ్యవస్థకు అర్హులైన అన్ని విభాగాలకు నిధులు సమకూర్చడానికి తమ  సన్నద్ధతను తెలియజేయడం ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యమని ఓ సీనియర్ అధికారి పేర్కొంటున్నారు.  డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం సహా ఆర్థిక చేరిక వంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ కస్టమర్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమాజానికి సేవ చేసే అంశంలో  ప్రభుత్వ రంగ బ్యాంకుల పునః స్థాపన, రీబ్రాండింగ్ కు ఈ కార్యక్రం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు బ్యాంక్ ప్రాధాన్యతలను గుర్తించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ధేశ్యమంటున్నారు.



బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి దశలో 13  జిల్లాల్లో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. రెండవ దశల్లో మరిన్ని జిల్లాలను ఈ కార్యక్రమంలో చేర్చనున్నారు. ఈ కార్యక్రమంలో పిఎమ్‌జెడివై / బిఎస్‌బిడి ఖాతాల కింద నూతన క్లయింట్ల ఆన్-బోర్డింగ్, ఆధార్ సీడింగ్ / ప్రామాణీకరణ, వివిధ భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల పట్ల పలువురి లబ్ధిదారులు తమ తమ అనుభవాలను పంచుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.  ఈ విధమైన చొరవ మార్కెట్ విభాగాలను గణనీయంగా మెరుగు పరచడమే కాక, ఈ పండుగ సీజన్ లో కస్టమర్లకు మద్దతు ఇవ్వడంతో సహా అవసరమైన విభాగాల సంస్థాగత నిధులకై ఓ సమగ్ర నిర్మాణానికి మార్గం  సులభతరం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: