బత్తాయికి గతంలో ఎన్నడూ లేని ధర ఇప్పుడు పలుకుతోంది. అటువంటి బత్తాయి ఎక్కువగా పండించే నెల్లూరు రైతులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రేటు బాగా ఉన్నప్పుడు సరైన దిగుబడి లేక ఆవేదన చెందుతూనే... ఉండే పంటను మంచి ధరకు అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నారు.


రాష్ట్రంలోని బత్తాయి సాగులో రాయలసీమ తర్వాత నెల్లూరు ఒకటి. ఇంచుమించు రాయలసీమ వాతావరణం ఉండే ఉదయగిరి, వెంకటగిరి పరిధిల్లో సుమారు 70 వేల ఎకరాలకు పైగా బత్తాయి సాగవుతోంది. అయితే, వరుసగా ఐదేళ్ల నుంచి కరువు రావడంతో సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. అదికాక, విపరీతమైన తెగుళ్లు భారిన పడడంతో.. పెట్టుబడులు బరించలేక కొందరు రైతులు చెట్లను నరికేశారు. ఇన్ని కష్టాలకు ఓర్చి తోటలను సాగు చేసిన రైతులు గతంలో గిట్టుబాటు ధరలు లేక లక్షల రూపాయల నష్టాలను చూశారు.


రాష్ట్రంలోని బత్తాయి సాగులో రాయలసీమ తర్వాత నెల్లూరు ఒకటి. ఇంచుమించు రాయలసీమ వాతావరణం ఉండే ఉదయగిరి, వెంకటగిరి పరిధిల్లో సుమారు 70 వేల ఎకరాలకు పైగా బత్తాయి సాగవుతోంది. అయితే వరుసగా ఐదేళ్ల నుంచి కరువు రావడంతో సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. అదీకాక విపరీతమైన తెగుళ్లు భారిన పడడంతో.. పెట్టుబడులు భరించలేక కొందరు రైతులు చెట్లను నరికేశారు. ఇన్ని కష్టాలకు ఓర్చి తోటలను సాగు చేసిన రైతులు గతంలో గిట్టుబాటు ధరలు లేక లక్షల రూపాయల నష్టాలను చూశారు.


ఈ ఏడాది బత్తాయి ధరలు బాగానే ఉన్నా.. దిగుబడులు లేకపోవడంతో రైతుల అవేదన అలానే ఉంది. ఈ ఏడాది బత్తాయి టన్ను 50 వేల నుంచి 60 వేల వరుకు పలుకుతోంది. కానీ ప్రతీ ఏడాది ఎకరాకు పది టన్నుల దిగుబడి వస్తుండగా.. ఈ ఏడాది కరువుతో ఐదు టన్నుల లోపే దిగుబడి వచ్చింది. తోటలకు సరైన కాలంలో నీటి తడులు అందకపోవడంతో.. కాయలు సైతం నాణ్యతను కోల్పోయాయి. ఆ కాయలను కొనుగోలు చేయడం లేదు వ్యాపారులు. దీంతో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నా.. కొనడానికి వ్యాపారులు రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.


మొత్తం మీద.. ప్రతీ ఏడు బత్తాయి రైతులకు ఏదో విధంగా నష్టం కలుగుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. సోమశిల నుంచి వచ్చే కెనాల్ పూర్తి చేసి.. నీరొచ్చేలా చేస్తే.. ఇటువంటి ధీనస్థితుల నుంచి బయటపడతామంటున్నారు రైతన్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి: