షావోమి సంస్థ నుంచి కొత్త ఫోన్ రెడ్ మీ 8 మార్కెట్లోకి రావడానికి ముహూర్తం పలికింది. ఇక గత రెండు సంవత్సరాల నుంచి 4జీబీ+64జీబీ కెపాసిటీతో ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలన్నా రూ.10,000 కన్నా ఎక్కువ ధర ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి మార్కెట్లో. 


ఇటీవల రెడ్‌మీ 8ఏ రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు అదే సిరీస్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌ దృష్టులో పెట్టుకొని రెడ్‌మీ 8 తీసుకొచ్చింది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యుయెల్ కెమెరా, నాచ్ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో కలవు. 


ఇక స్పెసిఫికేన్లేంటి అనే విషయానికి వస్తే  దీనికి సంబంధించి ఇప్పటివరకు తెలిసిన  స్పెసిఫికేషన్ల ప్రకారం 6.2 అంగుళాల స్క్రీన్ తో రెడ్ మీ 8 రానుంది. దీని రిజల్యూషన్ 720x1520 పిక్సెల్స్. యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉంటుంది. ఇందులో కూడా వెనకవైపు రెండు కెమెరాలు ఉండవచ్చు అని అంచనా. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్, హెచ్ డీఆర్, పనోరమ ఫీచర్లు ఉన్నాయి. 30 fps, 60 fps వద్ద 1080p వీడియోలు తీయవచ్చు. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఇందులో  క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఆధారిత ఎంఐయూఐ 10.0.1.3 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న మిగతా ఫోన్ల లాగానే ఈ ఫోన్ కూడా వాటర్ డ్రాప్ నాచ్ తో రాబోతుంది. 


ఇక ధర ఎంత అనేది విషయానికి వస్తే  అందరికి అందుబాటులో ఉండే విదంగా ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి మార్కెట్లో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్.. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుందని. ఇక కలర్స్ మాత్రం యాష్, బ్లూ, గ్రీన్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 


కానీ  దీపావళి పండుగ సీజన్ కావడంతో రెడ్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌పై రూ.1,000 డిస్కౌంట్ ప్రకటించింది షావోమీ. అంటే 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.7,999 ధరకే సొంతం చేసుకోవచ్చు అని ఆఫర్ రిలీస్ చేసింది. ఈ ఆఫర్ మొదటి 50 లక్షల యూనిట్స్‌కు మాత్రమే అని తెలిపింది. ఆ తర్వాత ధర పెరుగుతుంది. అక్టోబర్ 12 అర్థరాత్రి 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు Mi.com వెబ్‌సైట్‌లో సేల్ ప్రారంభం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: