అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓ పురుషుడుకి ఛాతి పెరగడానికి కారణమైన ఓ ఉత్పత్తికి కోర్టు భారీ జరిమానా వేసింది. ఆ సదరు బాధితుడుకి పెద్ద మొత్తం పరిహారంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఓ ఉత్పత్తి వాడిన ఓ పురుషుడి ఛాతి మహిళల వలె వక్షోజాలు పెరిగినట్లుగా పెరిగింది. దీంతో అతను కోర్టులో కంపినీ తనకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీనితో ఎనిమిది బిలియన్ డాలర్లు చెల్లించాలని ఫిలడెల్ఫియా కోర్టు తీర్పు చెప్పింది.


ఇలా మహిళల వక్షోజాల వలె పెరిగిన చాతి ఆటిజం స్పెక్ట్రమ్ అనే వ్యాధితో బాధపడుతున్న నికోలస్ ముర్రే 2003లో ఒక సైకాలజిస్ట్‌ను కలిశాడు. అయితే అతను ఓ మందు రాసి ఇచ్చాడు. అతనికి మహిళల వలె వక్షోజాలు వచ్చాయి. దీంతో నికోలస్ ఆ మందును ఉత్పత్తి చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై కోర్టుకు వెళ్లాడు నికోలస్ ముర్రే. ఈ మందు వాడకం వల్ల పురుషుల్లో ఛాతి పెరుగుతుందనే విషయాన్ని సంస్థ పేర్కొనలేదని, దీంతో తనకు ఛాతి పెరిగిందని పేర్కొన్నాడు.


దీనిని విచారించిన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా కోర్టు బాధితుడుకి ఎనిమిది బిలియన్ డాలర్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కానీ కోర్టు తీర్పుపై కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును కోర్టు వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నట్లు కంపెనీ తరపు లాయర్ తెలిపారు.


అయితే 2015లో తీర్పు వచ్చినా అతను జే అండ్ జే డ్రగ్‌ను రెండు వేల మూడు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఉపయోగించాడు. ఆ కాలంలో అతనికి ఛాతి వక్షోజాల్లా బాగా పెరిగింది. అయితే ఈ కేసులో 2015లోనే జడ్జి తీర్పును ఇచ్చారు. బాధితుడికి భారీగా ఆరు లక్షల ఎనబై వేల డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. అయితే ప్యునిటివ్ డ్యామేజెస్ ఇంక్లూడ్ కాలేదు అతనికి. అయితే ఇప్పుడు అతనికి ఎనిమిది బిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది


మరింత సమాచారం తెలుసుకోండి: