ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ  అమెజాన్‌ డెలీవరీ బాయ్‌ ఒకరు తనను హిప్నటైజ్‌ చేసి.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారంటూ ఓ 43 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆమె కధనం ప్రకారం డెలివరీ బాయ్‌ తనను హిప్నటైజ్‌ చేసి,అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు  డెలివరీ బాయ్ పై  ఆరోపణ చేసి, ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సదరు డెలివరీ బాయ్‌ వివరాలు ఇచ్చి అతని మీద ఫిర్యాదు చేశామని చెప్పారు.


ఈ విషయం పై  అమెజాన్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం అని వివరించి, ఇటువంటి ఆరోపణలు మమ్మల్ని  చాలా ఇబ్బంది పెడుతున్నాయి అన్నారు.
వెంటనే సదరు డెలివరీ బాయ్‌ మీద  తగిన చర్యలు చేపడతామని తెలిపారు.దీంతో పోలీసులు దారియాప్తు చేయగా కొన్ని సంగతులు వెలుగులోకి వచ్చాయి. అయితే  కేసు ఇప్పుడు సరి కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడానికి సదరు మహిళ నిరాకరిస్తున్నారు.

అంతేకాకుండా  దీనికి సంబంధించిన ఫిర్యాదును కూడా ఆమె వెనక్కి తీసుకున్నారు అని తెలిపారు. ఈ కేసు విచారణ చేపట్టిన నోయిడా ఎస్‌ఐ వినీత్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ ...అమెజాన్‌ డెలివరీ బాయ్‌ను  విచారించగా, తనపై వచ్చిన ఆరోపణలపై నిజం లేదని.....  తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూన్నానని అన్నాడు. అంతే కాదు తనని తాను  నిర్దోషి అని నిరూపించుకుంటా అని చెప్పాడు.

నేను కేవలం వస్తువుల రిటర్న్ తీసుకోవటం కోసమే బాధితురాలి  ప్లాట్‌కు వెళ్ళటం జరిగిందని.....కానీ అక్కడ అనుకోకుండా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది అన్నాడు. దాని తరువాత కూడా అక్కడే  కొన్ని ఫ్లాట్లలో అతను వస్తువులను డెలివరీ చేశానని కూడా వివరించాడు. పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షలు చేయించుకోమని అడగగా.... దానికి  ఆమె నిరాకరించిందని అన్నారు. 
అంతేకాకుండా ఆమె తన ఫిర్యాదును కూడా వెనక్కి  తీసుకుంటుందని  వారు స్పష్టం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: