పారిశ్రామిక ఉత్పత్తి రంగం దేశం మీద ఎంతగానో  ప్రభావం చూపుతుంది. పారిశ్రామిక ఉత్పత్తి రంగం ముఖ్యంగా తయారీ, విద్యుత్‌, మైనింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌,కన్జూమర్‌ డ్యూరబుల్స్‌,ఇన్‌ఫ్రా/నిర్మాణం,కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌ పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యిందని ఆర్థికవేత్త  అదితి నయ్యర్‌ తెలిపారు. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి.


2012 నవంబర్‌లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత ఈఆగస్టు నెలలో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది.జాతీయ గణాంకాల కార్యాలయం ఈ క్రింది విధంగా ఉంది అని గణాంకాలను  విడుదలచేసేంది..తయారీ రంగంలో మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్‌ ఉన్న ఈ విభాగంలో  అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది.  2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. విద్యుత్‌రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది.


2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.  మైనింగ్‌  విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ రంగంలో  రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది.


 ఇన్‌ఫ్రా/నిర్మాణం ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు  –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది.  కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌ రంగంలో సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్‌–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతంగా నమోదుఅయినది..  

మరింత సమాచారం తెలుసుకోండి: