మహానగరంలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌. వైన్స్‌ల వద్ద తోపులాడుకుంటూ.. కష్టపడి మద్యం కొనుక్కునే రోజులుపోయాయ్‌. తీరిగ్గా షాప్‌లో తిరుగుతూ నచ్చిన బ్రాండ్‌ కొనుక్కోవచ్చు. సూపర్‌ మార్కెట్ల తరహాలో సిటీలో వాక్‌ ఇన్‌ వైన్స్‌లు రాబోతున్నాయి. ఆల్కహాల్‌ లవర్స్‌కి మాంచి కిక్కిస్తోంది తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ.


మహానగరంలోని మద్యం ప్రియులకు మాంచి కిక్కవ్వనుంది తెలంగాణ ఎక్సైజ్‌శాఖ. మద్యం కోసం వైన్స్‌ల వద్ద తోపులాడుకుంటూ... గందరగోళం హడావుడి మద్య కొనుక్కునే పరిస్థితి ఇకపై లేదంటోంది. నచ్చిన బ్రాండ్‌ లేకనో... బ్రాండ్‌ ఉన్నా డిజిటల్‌ పేమెంట్‌ లేక... అన్నీ ఉన్నా మందుబాబుల రద్దీతో బాటిల్‌ బోలెడు కష్టాలు. దీనికితోడు పిక్‌ పాకెటర్స్‌. మందు కొనేలోపు.. మొబైల్‌ ఫోన్‌, పర్స్‌ పొటొట్టుకుంటున్న బాధితులు ప్రతీ వైన్స్‌ దగ్గర కామనే. 


ఇకపై ఇలాంటి సమస్యలేవీ ఉండవంటోంది ఎక్సైజ్‌శాఖ. సూపర్‌ మార్కెట్ లో షాపింగ్‌ తరహాలో... షాప్‌లో తిరుగుతూ.. నచ్చిన బ్రాండ్‌ను ఈజీగా కొనే అవకాశం కల్పించింది. ఎక్సైజ్‌ కొత్త పాలసీలో వాక్‌ ఇన్‌ లిక్కర్‌ మార్ట్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఎక్సైజ్‌ శాఖ. బీర్‌, బ్రాండీ, విస్కీ, రమ్‌, వోడ్కా, వైన్‌.. రకరకాల బ్రాండ్స్‌తో లిక్కర్‌ మార్ట్స్‌ సిటీలో వెలవనున్నాయి. 


ఊర మాస్‌.. మాస్.. క్లాస్‌.. రిచ్‌... ఇలా ఎవరికి మద్యం కావాలన్నా వైన్స్‌ లకు వెళ్లాల్సిందే. అందరితో సమానంగా కొనాల్సిందే. వైన్‌ మార్ట్స్‌ ఏర్పాటుతో.. ఈ సమస్య ఉండదు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు కొనుక్కోవచ్చు. వైన్స్‌ల్లో మాదిరిగా పేమెంట్‌ సమస్య కూడా లేకుండా కార్డ్‌ స్వైపింగ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ కూడా చేసుకోవచ్చు. 
వైన్‌ మార్ట్స్‌ ఏర్పాటుకు లైసెన్సు ఫీజుతో పాటు స్పెషల్‌ ఎక్సైజ్‌ పన్నుకు అదనంగా మరో 5 లక్షలు చెల్లించి టెండర్లు వేశారు. వైన్స్‌ల మాదిరిగానే ఏరియా పాపులేషన్‌ కు తగ్గట్టు... ఎక్సైజ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. 


ఇప్పటికే సిటీలో స్పెన్సర్స్‌ మాల్‌ లో వైన్‌ మార్ట్స్‌ ఉన్నాయి. ఇకపై ఇనార్భిట్‌ మాల్‌, ఫోరం మాల్‌, జీవీకే మాల్‌, సెంట్రల్‌, సిటీ సెంటర్‌ వంటి షాపింగ్‌ మాల్స్‌ లోనూ లిక్కర్‌ మార్ట్స్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మందుబాబులకు మాత్రం ఎక్సైజ్‌ శాఖ మాంచి కిక్కిచ్చే నిర్ణయం తీసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: