డబ్బుకోసం చాలా మంది చాలా రకాల పనులు చేస్తుంటారు.ఈ మధ్య మగవారు ఇంకా ఘోరంగా తయారయ్యారు.ఆఖరికి వ్యభిచారం అనే రొంపి లో దిగ దానికి కూడా వెనుకాడటం లేదు.ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏటేటా సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువై పోతుంది.సాధారణంగా మహిళలు ఈ వృత్తిలోకి ఎక్కువగా వెళ్తుంటారు. కానీ, మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మేల్ సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువైపోవడం విశేషం.

 ఓ సర్వే నివేదిక ప్రకారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.కేరళకు చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆ రాష్ట్రంలో సెక్స్ వర్కర్లపై ఓ సర్వే చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రస్తుతం కేరళలో 17,000 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా 13,331 మంది మగవారు ఉన్నారు. రాష్ట్రానికి వేరే చోట నుండి వస్తున్న  సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు సర్వేలో స్పష్టం చేసింది. ఇక కేరళలో మగ సెక్స్ వర్కర్లు ఎక్కువగా కోజికోడ్ జిల్లా నుంచి వస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

మగ సెక్స్ వర్కర్లలో 36 నుంచి 46 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. నగరాల్లోని హోటళ్లు, ఫ్లాట్లలో అద్దెకి ఉంటూ ఈ వృత్తి చేస్తున్నట్లు సర్వేలో పేర్కొంది. కేరళలో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారు ఈ అసాంఘిక కార్యకలాపాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది.

కేరళకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువగా వలస వస్తుండటం గొప్ప విశేషం. బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి మహిళా సెక్స్ వర్కర్లు ఎక్కువగా వలస రావడం, ముఖ్యంగా బెంగాల్ నుంచి చాలా మంది సెక్స్ వర్కర్లు ఏజెంట్ల ద్వారా కేరళకు తరలి వస్తున్నారు అని సర్వేలో పేర్కొన్నారు. బీహార్ నుంచి వస్తున్న పురుషుల్లో ఎక్కువ మంది ఈ వృత్తిలోకి ఆసక్తి చూపడం ముఖ్యమైన అంశం. ఈ వృత్తిలోకి వస్తున్న వారు క్రమంగా వారి వారి చుట్టాలను కూడా ఇదే వృత్తిలోకి తీసుకొస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: