ఈ మద్య కొన్ని సినిమాల్లో కాంట్రవర్సీ డైలాగ్స్..పాటలు పెట్టడం అవి కాస్త కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీస్ కాంప్లెంట్ చేయడం..కోర్టుకు ఎక్కడం కామన్ అయ్యింది.  ఇప్పటికే పలు చిత్రాలపై ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడం వారి కోరిక మేరకు అలాంటివి కట్ చేయడం చేస్తున్నారు.  తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’.  అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది.
Image result for గుడిలో బడిలో మడిలో ఒడిలో
దీంతో ఈ చిత్రం మాస్ ఇమేజ్ సొంతం చేసుకుందని కొడితే గట్టిగా కొడతాం అని ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో ‘గుడిలో.. బడిలో మడిలో.. ఒడిలో’ పాటపై విమర్శలు వచ్చాయి.  బ్రహ్మాణ సంఘం వారు ఈ పాటలో అస్మైక యోగ త‌స్మైక భోగ‌..` అనే పాట‌లో `న‌మ‌కం..చ‌మ‌కం..`  అనే ప‌దాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని  ఓ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని వివాదం చెల‌రేగిన సంగ‌తి విదితమే.  అయితే దీనిపై అప్పట్లో దర్శకుడు హరీష్ శంకర్ తాను కూడా బ్రాహ్మణ కుర్రాడినే అని బ్రహ్మాణులను కించపరిచేలా తాను సినిమా తీయలేదని ఒక బ్రాహ్మణ కుర్రాడు తల్చుకుంటే ఏంత పనైనా చేస్తాడని గొప్పగా సినిమా తీసినట్లు చెప్పాడు.  
Image result for గుడిలో బడిలో మడిలో ఒడిలో
అంతే కాదు ఆడియో ఫంక్షన్లో కూడా ఈ పాటపై కొన్ని కామెంట్లు చేయడంతో మరోసారి బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో..లాభం లేదని దిగి వచ్చిన దర్శక, నిర్మాతలు సెన్సార్ స‌మ‌యంలోనే న‌మ‌కం..చ‌మ‌కం అనే ప‌దాల‌ను మార్చి వాటి స్థానంలో నా గ‌మ‌కం..నీ సుముఖం అనే ప‌దాల‌ను పొందుప‌రిచి సెన్సార్ స‌భ్యుల నుండి అమోదం పొందారు. సినిమాలో, ఇక‌పై రానున్న ఆల్బ‌మ్స్ అన్నింటిలో కొత్త ప‌దాల‌తో కూడిన పాట విన‌ప‌డుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు. పొరపాటున పాత పాటే రిపీట్ అయితే మాత్రం మరి బ్రహ్మాణ సంఘాలు రచ్చచేస్తాయా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: