‘దువ్వాడ జగన్నాథమ్’ మొదటి వారం పూర్తి అయ్యే సరికి ఈమూవీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ నిర్మాత దిల్ రాజ్ మొన్న రాత్రి జరిగిన ఈమూవీ సక్సస్ మీట్ లో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రకటన టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తూ డివైడ్ టాక్ వచ్చిన సినిమా ముఖ్యంగా ఓవర్సీస్ లో ఎదురీత ఈదుతున్న ఈమూవీకి మొదటి వారం ముగిసే సరికి 100 కోట్లు ఎక్కడ నుంచి వస్థాయి అన్న చర్చలు టాలీవుడ్ లో మొదలైపోయాయి.

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ జాతీయ దిన పత్రిక ఈరోజు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల ఫేక్ కలక్షన్స్ ఫై ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.ఇదే సందర్భంలో ఆ పత్రిక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె.దామోదర ప్రసాద్ ఆ పత్రికా ప్రతినిధితో అన్న కామెంట్స్ ను కూడ వివరంగా ప్రచురించింది.

ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు వస్తున్న కలక్షన్స్ పై ఎటువంటి క్లారిటీ లేదని కేవలం టాప్ హీరోల మధ్య పోటీ పెరిగి పోవడంతో ఈ కలక్షన్స్ కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి కానీ ఈ కలక్షన్స్ లో ఎంతవరకు యధార్ధత ఉంది అని చెప్పడం చాల కష్టం అని దామోదర ప్రసాద్ కామెంట్స్ చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది. ముఖ్యంగా ‘దువ్వాడ జగన్నాథమ్’ సంబంధించి నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరించడంతో పాటు అల్లు అరవింద్ కు ఆంధ్ర – తెలంగాణా రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లు చేతిలో ఉండటంతో ‘దువ్వాడ’ కలక్షన్స్ కు సంబంధించి ఎక్కడో ఏదో క్లారిటీ లేని విషయాలు ఇమిడి ఉన్నాయి అంటూ ఈ పత్రిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అంతేకాదు గతంలో వచ్చిన అల్లుఅర్జున్ ‘సరైనోడు’ రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాల కలక్షన్స్ రికార్డుల విషయంలో ఇలాంటి వివాదాలే వచ్చాయని ఆ పత్రిక పేర్కొంటూ కేవలం ఇటువంటి సినిమాలను తీసిన భారీ నిర్మాతలు తమ కలక్షన్స్ ఫిగర్స్ ను పెంచి చూపెడుతూ మరో టాప్ హీరో సినిమా డేట్స్ ను సంపాదించుకోవడానికి ఇలాంటి కలక్షన్స్ హంగామా సృష్టిస్తున్నారు అంటూ వివరణాత్మకంగా ఆ పత్రిక వ్రాసిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా దిల్ రాజ్ ‘దువ్వాడ’ కలక్షన్స్ ను దుమ్ము దులుపుతోంది అని చెపుతుంటే ఈసినిమా బయ్యర్లు మాత్రం కనీసం నష్టాలు లేకుండా ఈసినిమా నుండి బయటపడతామా అని మధన పడుతున్నట్లు టాక్..
 



మరింత సమాచారం తెలుసుకోండి: