తెలుగు సినీ పరిశ్రమలో కాంట్రవర్సీ కి మరో పేరు ఎవరు..? అని ప్రశ్నించుకుంటే టక్కున వచ్చే సమాధానమే రాం గోపాల్ వర్మ. ఇప్పటివరకు ఈయన తీసిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు రాజకీయ రౌడీయిజానికి సంబంధించినవే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఆయన ఎంచుకునే పంథా అలాంటిది. అందరు దర్శకుల ఆలోచనలకు విభిన్నంగా సినిమాలు తీయాలనే ఆలోచన ఆర్జీవీ కి ఎలా వచ్చిందో తెలియదు గానీ ఆయన ఆలోచనలను మాత్రం తెలుగు ప్రజలు మనసారా స్వీకరిస్తూ వస్తున్నారు. మన దేశ, రాష్ట్ర చరిత్రలో జరిగిన కొన్ని రాజకీయ విప్లవాలను టార్గెట్ చేసుకున్న ఆర్జీవీ ఆ దిశగా సినిమాలు తీయడం ప్రారంభించాడు.


Image result for ramgopal varma

గతంలో ఆర్జీవీ దర్శకత్వం వహించిన రక్త చరిత్ర రెండు భాగాలు రాజకీయ రౌడీయిజానికి సంబంధించినవే. సరిగ్గా మళ్ళీ ఇలాంటి కథావైపే మొగ్గు చూపుతున్నాడు ఆయన. యిప్పుడు ఆయన కన్ను ఏకంగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ పై పడింది. ఏకంగా ఎన్టీఆర్ ఫై సినిమా తీయనున్నట్లు నిన్న ప్రకటన సైతం విడుదల చేసాడు ఆర్జీవీ. ఈ ప్రకటన వెలువడుడే ఆలస్యం తెలుగు సినిమా పరిశ్రమలో, రాష్ట్ర రాజకీయాల్లో ఈ వార్త ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇంతకీ ఈ మహానుభావుడు ఈ సినిమాను కాంట్రవర్సీ తీస్తాడా..? చేస్తాడా..? అన్న అనుమానం సినీ, రాజకీయ వర్గాల్లో నెలకొంది.


Image result for ramgopal varma

ఇక ఈ సినిమాలో పాత్రల విధ్యానికి వస్తే ఇందులో మెయిన్ రోల్స్ ఎన్టీఆర్, చంద్రబాబు, లక్ష్మీ పార్వతిలదే. అయితే ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ ఎలా మరణించారు..? బాబు అధికారాన్ని ఎలా చేపట్టారు..? దీనిపై లక్ష్మీ పార్వతి అభిప్రాయం...? ఇలా ఎన్నో ప్రశ్నలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మెదులుతున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది, రాబోయే కాలం అసెంబ్లీ ఎన్నికల సమయం. మరి ఈ సినిమా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందా..? లేక కేవలం ప్రేక్షకులు దీనిని సినిమా కోణంలో ఆలోచిస్తారా..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. .

మరింత సమాచారం తెలుసుకోండి: