దేశంలో చాలామంది విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం చదివినవారు, చదువు అయిపోయిన తరువాత ఎక్కువ డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్లిపోతూ వుంటారు. అక్కడవారు విలాసవంతమైన జీవితం తో ఆడుతూ పాడుతూ గడిపేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ క్రమంలో కొందరు ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు మాత్రం అలా కాకుండా తమకున్న టాలెంట్స్ ను రాబోయే తరాలు బాగుపడాలని ఉపయోగిస్తున్నారు.

ఈ సందర్భంగా దేశంలో ఉండే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో సదరు విద్యార్థులు Fundukate అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 2017 సంవత్సరం జూన్ మాసంలో ప్రారంభం అయింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం తాము బాగుపడుతూ ఇతరులను బాగుపరచడమే. ఈ సంస్థ‌కు మొద‌ట‌గా ఆలోచ‌న చేసింది శ‌ర్వాని. ఈమె ఎన్ఐటీ కాలిక‌ట్‌లో బీటెక్ చ‌దివింది.

తనతోపాటు తన మిత్రుల సహకారంతో FunduKateను ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే వీరంద‌రూ త‌మ అభిప్రాయాల‌ను పంచుకుని ఆ దిశ‌గా ఈ సంస్థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డం మొద‌లు పెట్టారు. అయితే వీరందరి ఒక టీంగా ఏర్పడి పిల్లల మధ్య అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను బయటపెడుతున్నారు.

ఇలా వారు ఇప్పటికీ 25 పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లో ఉన్న టాలెంట్స్ బయట పెట్టడం జరిగింది. దీంతో 99.8 శాతం పిల్ల‌ల‌కు మేలు క‌లిగింది. అయితే వారు ఈ ప్రోగ్రామ్ ను ఇక‌పై కూడా నిర్వ‌హించ‌నున్నారు. ఏది ఏమైనా శ‌ర్వాని, ఆమె స్నేహితులు చేస్తున్న ఈ ప‌నిని మ‌నం నిజంగా అభినందించాల్సిందే క‌దా..!


మరింత సమాచారం తెలుసుకోండి: