- అంతర్ జిల్లా  దొంగలని అరెస్ట్ చేసిన రాజమండ్రీ పోలీసులు
జల్సాలకు అలవాటు పడి పలు చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను రాజముండ్రి పోలీస్ లు గురువారం అరెస్ట్ చేసారు. వారి నుంచి సుమారు 4 లక్ష ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోనికి వెళ్తే ....


రాజమండ్రీ రూరల్ ప్రాంతమైన ధవళేశ్వరం లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 4 గురు యువకులను ఆదుపులోకి తీసుకుని ఆరా తీయగా  పలు దొంగతనాలు కు పాల్పడినట్టు యువకులు తెలిపారు.  రాజమండ్రీ అర్బన్ అడిసినల్ ఎస్పీ రమణ కుమార్ ఇందుకు సంబందించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసు లో ఉన్న యానాం కు చెందిన దుర్గాప్రసాద్ జల్సాలకు అలవాటు పడ్డాడు.  15 సంవత్సరాలు వయసు నుండి అతడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

పలు సార్లు అరెస్ట్ అయ్యి జువెనల్ హోమ్ లో శిక్ష అనుభవించడం జరిగింది. అక్కడ నుండి బైటకు వచ్చిన నెల రోజులకు మళ్లీ హైదరాబాద్, తూర్పు, పచిమ గోదావరి జిల్లాలో ముగ్గురు తో కలసి పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ నెల రోజుల్లో 8 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఆ నలుగురు చోరీ చేసిన 4 లక్షల రూపాయలు నగదు, బంగారం, వెండి, సెల్ ఫోన్,  బైక్ వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని వారిని కోర్టు కి హాజరు పరుస్తున్నమని ఆయన తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: