మన ఏపీలో కోటప్పకొండ వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగే జాతరల సమయంలో కొందరు అక్రమార్జన కోసమో, లేదో డబ్బున్న మహారాజులు విలాసాల కోసమో..రికార్డింగ్ డాన్స్‌లు నిర్వహిస్తారు. తొలుత కాస్త సభ్యతగానే కనిపించినా... షో జరుగుతున్న కొద్ది..నిర్వా‍‍‍హకుల వత్తిడి వల్లనో, బెదిరింపులవల్లనో కానీ,  యువతులు తమ డ్రెస్సులను ఒక్కొక్కటిగా తీస్తూ అర్థనగ్నంగా ఒకోసారి పూర్తి నగ్నంగా డాన్సులు వేస్తుండడం చూస్తుంటాం. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ రికార్డింగ్ డాన్సుల పేరుతో అశ్లీల నృత్యాలు మాత్రం ఆగడం లేదు. అయితే అస్సాంలో ఇలాగే రికార్డింగ్ డాన్సులకు వచ్చారనుకుని కొందరు గిరిజన మహిళా కళాకారులను నగ్నంగా డాన్స్ చేయకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తూ, వారిని శారీరకంగా వేధించిన ఘటన ఇటీవల బయటపడింది. 


పూర్తి వివరాల్లోకి వెళితే అస్సాం రాష్టంలోని చేయగావ్‌ గ్రామంలో జరిగిన ఒక ఉత్సవం సందర్భంగా నిర్వాకులు ఒక డాన్స్‌ ప్రోగ్రామ్‌  ఏర్పాటు చేశారు.  వేరే ఊరి నుంచి 37,000 రూపాయలు ఇచ్చి రెండు డాన్స్‌ బృందాలను రప్పించారు. అయితే డాన్స్ బృందాలకు మాత్రం కల్చరల్ ప్రోగ్రాం అని చెప్పి, ఊరిలో మాత్రం రికార్డింగ్ డాన్సు అని చెప్పి, అమ్మాయిలు న్యూడ్‌గా డాన్సులు చేస్తారంటూ భారీగా టికెట్లు అమ్మారు. ఇదేమి తెలియని గిరిజన కళాకారుల బృందం తమ సంప్రదాయ నృత్యాన్ని ఆరంభించారు. దీంతో నిర్వాహకులు వాళ్ళను నగ్నంగా నృత్యం చేయాలని బలవంతం చేశారు. అందుకు ఆ గిరిజన యువతులు ఒప్పుకోకపోవడంతో ఆ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌కు హాజరైన 700 గ్రామస్తులు కూడా వారిని నగ్నంగా నృత్యం చేయాలని బెదిరించారు. మీరు నగ్నంగా డాన్సులు చేస్తారని వాళ్ళు టిక్కెట్లు అమ్మితే కొనుక్కున్నాం… డబ్బు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్నాక… ఇప్పుడు మీరు నగ్నంగా నృత్యం చేయకపోతే ఎలా? అని ఆ గ్రామస్థులు యువతులతో గొడపపడ్డారు. 


 అయితే మేము అలాంటి నృత్యాలకు ఒప్పుకోలేదని..కల్చరల్ ప్రోగ్రాం అంటే వచ్చామని,  మీరు ఎంత బలవంతం చేసినా మేము నగ్నంగా నృత్యం చేయమని తేల్చిచెప్పారు ఆ డాన్సర్లు. దాంతో నిర్వాహకులు న్యూడ్‌ డ్యాస్‌ చేయకపోతే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ  ఆ గిరిజన యువతుల నృత్య బృందం అక్కడి నుంచి పారిపోయి ఒక వాహనంలో ఎక్కి తప్పించుకున్నారు. కొంత దూరం వెళ్లాక పోలీసులకు, తెలిసిన వాళ్ళకు ఫోన్‌ చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం ఆ గిరిజన యువతుల ప్రాంత ప్రజలకు తెలియడంతో ఈ ఘటనకు నిరసనగా వందలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్‌గా తీసుకుని నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. చూశారుగా..మగాళ్లు కామంతో ఎలా మృగాళ్లుగా, రాక్షసులుగా తయారవుతున్నారో..పాపం పొట్టకూటి కోసం డాన్స్ చేసుకునే ఆ అమాయక గిరిజన యువతను నగ్నంగా డాన్స్ చేయాలని ఎంతగా వేధించారో...ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: