కావాల్సిన ప‌దార్థాలు:
- జొన్న పిండి- 50 గ్రా 
- గోధుమ పిండి- 2 స్పూన్స్ 
- సెన‌గ పిండి- 50 గ్రా
- మిరియాల పొడి- 1 టీ స్పూన్‌
- సోంపు పొడి- 1 టీ స్పూన్‌
- నువ్వుల‌ పొడి- 2 టేబుల్ స్పూన్స్‌
- బాదం ప‌ప్పుల పొడి- 1 టేబుల్ స్పూన్‌
- జీడిప‌ప్పు పొడి- 1 టేబుల్ స్పూన్‌
- జీల‌క‌ర్ర పొడి- 1 టీ స్పూన్‌
- మిర‌ప కారం- 1 టీ స్పూన్‌
- ధ‌నియాల పొడి- 1 టీ స్పూన్‌
- చాల్ మ‌సాలా- 1 టీ స్పూన్‌
- గ‌స‌గ‌సాల పొడి- 1 టీ స్పూన్‌
- నూనె- 1 టేబుల్ స్పూన్‌
- ఉప్పు- త‌గినంత‌, నీళ్లు - త‌గినంత‌


త‌యారుచేసే విధానం: ముందుగా జొన్న పిండి, గోధుమ పిండి, సెన‌గ పిండి ఒక‌టిగా క‌లిపి జ‌ల్లెడ‌ప‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కాచిన నూనె వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. త‌గిన‌న్ని నీళ్లు పోసుకుని చ‌పాతీ పిండిలా క‌లిపి ఉండ‌లు చేసుకోవాలి. మ‌రియు ఒక ప్లేట్‌లో అన్ని పొడుల‌ను వేసి మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ముందుగా చేసుకున్న పిండి మిశ్ర‌మాన్ని చ‌పాతీ మాదిరిగా ఒత్తుకోవాలి.


ఆ త‌ర్వాత త‌యారుచేసుకుని ఉంచుకున్నపొడుల మిశ్ర‌మాన్ని కొద్దిగా తీసుకుని చ‌పాతీ మీద వేసి, చ‌పాతీని రోల్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొడి అన్ని పొర‌ల‌కు అంటుతుంది. రోల్ చేసిన వాటిని చాకు సహాయంతో చిన్న చిన్న ముక్క‌లుగా క‌ల్ చేయాలి. స్టౌ మీద బాణ‌లిలో నూనె పోసి కాచుకోవాలి. త‌యారుచేసి ఉంచుకున్న వాటిని నునూలో వేసి గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు ఫ్రై చేసుకుని, పేప‌ర్ ట‌వ‌ల్ మీద‌కు తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ జొన్న మ‌సాలా స్నాక్ రెడీ. 


జొన్న‌ల‌తో ఈ స్నాక్ చేసుకుని తిన‌డం వ‌ల్ల చాలా మంచిది. నిజానికి జొన్న‌ల‌ను ప్ర‌స్తుత కాలంలో ఆహారంగా తీసుకోవడం చాలా తగ్గించేశారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలను డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. ఇవి క్యాన్సర్, మధుమేహం వంటి రోగ్యాలను నయం చేస్తాయి. మీకు జొన్న‌లు తిన‌డం ఇష్టంలేక‌పోతే ఇలా స్నెక్‌గా చేసుకుని తిన‌వ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: