కావాల్సినవి: 
మటన్‌ కీమా - పావుకిలో, 
అల్లం - ఒక మోస్తరు ముక్క,
కొత్తిమీర తరుగు - అరకప్పు,  
పచ్చిమిర్చి - మూడు, 
వెల్లుల్లి - 5 రేకలు, 
ధనియాల పొడి - ఒక టీస్పూను, 
కారం - ఒక టీస్పూను, 
ఉప్పు - తగినంత


తయారు చేసే విధానం:
మటన్‌ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కీమాలో నీరు లేకుండా చూసుకోవాలి. ఈలోపు కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రెండు స్పూనుల నీళ్లువేసి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టులోనే కీమా, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఈ మ‌ట‌న్‌ కీమా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. చుట్టినప్పుడు గట్టిగా నొక్కితే బాల్స్‌ విడిపోకుండా ఉంటాయి. 


ఒక గిన్నెలో నీళ్లు వేసి అందులో బాల్స్‌ని వేసి బాగా ఉడికించాలి. బాల్స్‌ ముక్కముక్కలుగా విడిపోతాయేమో అన్న భయం అవసరంలేదు. కీమాని కడిగినప్పుడు అందులో నీళ్లు పిండేసాం కాబట్టి అంత త్వరగా బాల్స్‌ విడిపోవు. బాగా ఉడికాక వాటిని బయటికి తీసేయాలి. ఆ త‌ర్వాత‌ క‌డాయిలో డీప్‌ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకుని వేడయ్యాక బాల్స్‌ని అందులో వేసి వేయించాలి. 


గోల్డ్‌ బ్రౌన్‌ వచ్చేవరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే మటన్‌ కీమా బాల్స్ రెడీ..  మటన్‌ అనేక పోషకాలు కలిగి ఉంటుంది. ఎక్కువగా ఐరన్‌, జింక్‌ ,సెలీనియం ఉంటుంది. ఐరన్‌ మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించే హేమోగ్లోబిన్‌ను ఏర్పరచడంలో సహాయపడుతుంది. అదే విధంగా మ‌ట‌న్ వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావాల్సిన ఎన్నో పోషాకాలు అందుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: