ఈ వారాంతంలో స్నాక్ పార్టీ ఉందా.? ఇంటికి వచ్చే అతిధుల కోసం ఏమి చెయ్యాలి ముఖ్యంగా శాఖాహారుల కోసం ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా.? పన్నీర్ తో రుచికరమైన స్నాక్ చెయ్యటమెలాగో చూద్దాం. పన్నీర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందువల్ల ఈ స్నాక్ తప్పక ప్రయత్నించవలసిన వంటకం. ఈరోజు మేము చెప్పబోయే వంటకం "స్పైసీ పన్నీర్".కావాల్సిన పదార్ధాలు:

సన్నగా తరిగిన పచ్చి మిర్చి-2 (లేదా) 3,
,తురిమిన పన్నీర్-1.5 కప్పు,
ఉడికించి స్మాష్ చేసిన ఆలు-1,
వైట్ బ్రెడ్-8 స్లైస్లు,
బ్రెడ్ క్రంబ్స్-1/2 కప్పు ,
సన్నగా తరిగిన కొత్తిమీర-కొద్దిగ ,
తురిమిన చీజ్-3 టేబుల్ స్పూన్లు,
కారం-1 టీ స్పూను,
నూనె-వేయించడానికి సరిపడా,
ఛాట్ మసాలా-1/2 టీ స్పూను,
ఉప్పు-రుచికి తగినంత,
తయారీ విధానం:

ఒక పెద్ద గిన్నె తీసుకుని పదార్ధాలన్నీ వేసి బాగా కలిపి పిండిలా తయారు చెయ్యాలి. బ్రెడ్ స్లైసులని తీసుకుని చివర్లు కత్తిరించాలి. చపాతీ కర్ర తీసుకుని బ్రెడ్ స్లైసులని చపాతీలాగ వత్తుకోవాలి. ముందు తయారు చేసుకున్న పిండిని ఒక్కో స్లైసులో పెట్టి మరలా వత్తాలి. ఇలా వత్తుకున్న ఒక్కో స్లైసుని మూడు ముక్కలుగా కోసి లోపలి స్టఫ్ఫింగ్ విడిపోకుండా ఒక టూత్ పిక్‌తో అదిమి పెట్టాలి.

స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడి చేసి పైన ముక్కలుగా కోసుకున్న బ్రెడ్ స్లైసులని వేయించాలి. బాగా వేగాకా ఒక కిచెన్ నాప్కిన్ మీదకి తీసుకుంటే ఇది నూనెని పీల్చుకుంటుంది. ఈ రోల్స్ అతిధులకి వడ్డించేముందు టూత్ పిక్ తీసి మీకిష్టమైన చట్నీ లేదా డిప్ తో కలిపి వడ్డించాలి. ఈ రోల్స్‌నే మరింత పసందుగా మార్చాలనుకుంటే పండు మిర్చి టమాటా చట్నీ లేదా పుదీనా మరియు కొత్తిమీర చట్నీతో కలిపి వడ్డించవచ్చు. మరింక ఆలశ్యమెందుకు ప్రయత్నించి ఎలా ఉందో చూసేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: