కావల్సిన పదార్థాలు: 
బియ్యం పిండి: 1 కప్పు
బెల్లం: 1/2 కప్పు


పచ్చిశెనగపప్పు- 1కప్పు
బెల్లం తురుము: 1కప్పు
ఏలకుల పొడి: చిటికెడు 


తయారీ విధానం: 
ముందుగా పచ్చిశెనగపప్పును ఉడికించి నీటిని వంపేయాలి. బెల్లంను పొడి చేసుకోవాలి. ఉడికించిన శెనపప్పు, బెల్లం, ఏలకుల పొడి కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండిలో బెల్లం పొడి వేసి కొద్దిగా నీటిని కలిపి ముద్దలా చెయ్యాలి. 


దీనిని చిన్న చిన్న ఉండ‌లుగా చేసి ఒక్కోదాన్ని పూరీల్లా వత్తాలి. ఇలా చేసిన పూరిల్లో పూర్ణం లడ్డూని పెట్టి మడత వేసి అంచులను  చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న అన్నింటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఎక్కువ తీపి కావాల‌నుకునే వారు, ఇష్ట‌ప‌డేవారు పైన పంచదారను చల్లుకుంటే స‌రిపోతుంది. అంతే వినాయ‌క చ‌వితి స్పెష‌ల్.. పూర్ణం కుడుములు రెడీ..! వినాయ‌క చ‌వితి రోజున దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుని స్వీక‌రిస్తే మంచిది.




మరింత సమాచారం తెలుసుకోండి: