కావాల్సిన ప‌దార్ధాలు:
అన్నం- కప్పు
మిరియాల పొడి- 1 టేబుల్‌స్పూను
ఎండుమిర్చి- నాలుగు
కరివేపాకు- రెండు రెమ్మలు


చింతపండు- కొద్దిగా
నూనె- 2 టేబుల్‌ స్పూన్లు
పోపు దినుసులు- 2 చెంచాలు


పల్లీలు- టేబుల్‌స్పూను
జీడిపప్పు - కొన్ని
పసుపు- పావుచెంచా
ఉప్పు- తగినంత


తయారీ విధారం:
ముందుగా బాణలిని స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే పోపు దినుసులు వేసి దోరగా వేగాక ఎండుమిర్చీ, జీడిపప్పు పలుకులూ, కరివేపాకూ వేయాలి.


రెండు నిమిషాల తరవాత చింతపండు గుజ్జు వేసి మంట తగ్గించాలి. అది ఉడికాక అన్నం, పసుపూ, ఉప్పూ, మిరియాల పొడీ, వేయించిన పల్లీలూ వేసి బాగా కలిపి దింపేయాలి. అంటే టేస్టీ టేస్టీ మిరియాల పులిహోర రెడీ.. దీన్ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం లంచ్‌లా కూడా తీసుకోవ‌చ్చు.


కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. మిరియాల‌తో ఇంకా ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అలాంటి మిరియాల‌తో పులిహోర చేసుకొని తింటే చాలా మంచిది.





మరింత సమాచారం తెలుసుకోండి: