కావాల్సిన‌ పదార్థాలు:
బీరకాయలు- 2
రొయ్యలు- 400 గ్రా
ఉప్పు- తగినంత
కొత్తిమీర- కొద్దిగా


నూనె- 2 టీ స్పూన్లు
ఉల్లిపాయలు- 2
పచ్చిమిర్చి- 4
కరివేపాకు- 4 రెబ్బలు
దనియా- అర టీ స్పూన్‌


జీర, పసుపు పొడులు- అర టీ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు- 1 టేబుల్‌ స్పూను
కారం- ఒకటిన్నర టీ స్పూను
గరం మసాల పొడి- అర టీ స్పూను


త‌యారీ విధానం:
ముందుగా రొయ్యల్లో 1 టీ స్పూను కారం, పావు టీ స్పూను ఉప్పు, దనియా, జీర, పసుపు పొడులు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్ది నూనెలో నీరంతా ఆవిరయ్యేవరకు చిన్నమంటపై వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.


ఇప్పుడు క‌ట్ చేసుకున్న బీర ముక్కలు, ఉప్పు కలిపి మగ్గించాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావుకప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లితే స‌రిపోతుంది. అంతే అదిరిపోయే బీర‌కాయ రొయ్య‌ల కూర రెడీ..  


మరింత సమాచారం తెలుసుకోండి: