కావాల్సిన ప‌దార్ధాలు:
బ్రెడ్‌ స్లైసులు- 6,
ఉల్లిపాయ- 1
ట‌మాటా- 1


నెయ్యి- 1 స్పూన్స్‌
ఉప్పు- తగినంత
ఆవాలు- అర‌స్పూన్‌
సెనగపప్పు- అరస్పూన్‌


పచ్చిమిర్చి- 2
అల్లంతరుగు- కొద్దిగా
 పసుపు- చిటికెడు
సాంబార్‌పొడి- 1 స్పూన్‌


తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ స్లైసుల్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేసి స్టౌ మీద పెట్టాలి. అది కరిగాక బ్రెడ్‌ ముక్కల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, సెనగపప్పూ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ, కరివేపాకు వేయాలి.


ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టొమాటో ముక్కలూ, పసుపూ, సాంబార్‌ పొడీ, ఉప్పూ వేసి స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే బ్రెడ్‌ ఉప్మా రెడీ. 
బిజీ లైఫ్‌లో ఇలాంటి ఈజీ బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవ‌డం వ‌ల్ల టైమ్‌సేవ్ అవ్వ‌డంతో పాటు ఆక‌లీ తీరుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: