రసంలేదా చారు అనేది ఒక దక్షిణభారతంలోని సూపు.ఈ వంటకంలో ప్రధానంగా చింతపండు రసం ఉపయోగించడంతో పాటు అదనంగా టమోటో, మిరప మరియు ఇతర రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు.అంతేకాకుండా ఏదేని కూరగాయలు జోడించడంతో పాటు ఉడకబెట్టిన పప్పులును కూడా కొంచెం ఈ రసానికి కలుపుతారు.ప్రస్తుత రోజుల్లో రసం తయారీకి అవసర మైన మసాలా దినుసులన్నింటినీ ఒక్కటిగా జోడించి ముందుస్తుగానే పొడిచేసి అప్పటికప్పుడు ఉపయోగించడానికి వీలుగా రసం పొడి పేరుతో దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారు.ఇక ఈ రసాన్ని అన్నంతో కలిపి లేదా సూపురూపంలో తీసుకు నేందుకు వీలుగా ఉంటుంది.సాంబారుతో పోలిస్తే రసం అనేది ఒక విశిష్టమైన రుచిని కలిగి ఉంటుంది.ఇంతలా నోరూరించే ఈ రసంలో వెల్లుల్లి రసం ఎలా చేస్తారో తెలుసుకుందాం..



కావలసినవి:మిరియాలు–ఒక టీ స్పూను..జీలకర్ర–ఒక టీ స్పూను..వెల్లుల్లి–మూడు రెబ్బలు..ఎండు మిర్చి–2..నీళ్లు–అర కప్పు.. చింతపండు–ఒక టేబుల్‌ స్పూను...నువ్వుల నూనె –ఒక టేబుల్‌ స్పూను...ఆవాలు–అర టీ స్పూను...మినప్పప్పు–అర టీ స్పూను ...కరివేపాకు–రెండు రెమ్మలు..వెల్లుల్లి రెబ్బలు–10...తరిగిన టమాటా–1...పసుపు– పావు టీ స్పూను...ఇంగువ–పావు టీ స్పూను... నీళ్లు–రెండు కప్పులు...ఉప్పు–తగినంత...కొత్తిమీర–2 టేబుల్‌ స్పూన్లు...



తయారీ:చింతపండును తగినన్ని నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి.మిక్సీ జార్‌లో మిరియాలు,జీలకర్ర,వెల్లుల్లి రేకలు,ఎండు మిర్చి వేసి మిక్సీ పట్టి,పక్కన ఉంచాలి.10 వెల్లుల్లి రేకలను తొక్క తీయకుండా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి.టమాటాలను సన్నగా తరిగి ఉంచుకోవాలి..స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి.కరివేపాకు,ఎండుమిర్చి,వెల్లుల్లి వేసి రంగులోకి మారేవరకు వేయించాలి.. టమాటా తరుగు, పసుపు, ఇంగువ జత చేసి,టమాటాలు మెత్తగా ఉడికే వరకు కలియబెట్టాలి..మిక్సీ పట్టిన రసం పొడి జత చేసి బాగా కలపాలి.చింతపండు రసం,రెండు కప్పుల నీళ్లు,ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఆరు నిమిషాలు మరిగించి దింపేయాలి..దీన్ని కొత్తిమీరతో అలంకరించి వేడివేడి అన్నంలో వడ్డించాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: