కావాల్సిన ప‌దార్థాలు:
ఓట్స్‌- ఒకటింపావు కప్పు
ఖర్జూరం- ఒక‌ కప్పు
పంచదార- ఒక‌ కప్పు


నీళ్ళు- ముప్పావు కప్పు
బేకింగ్‌ సోడా- కొద్దిగా  
ఉప్పు-  చిటికెడు


వెన్న- అరకప్పు
పంచదార- అర కప్పు
మైదా- ఒకటిన్నర కప్పు


తయారీ విధానం:
ముందుగా ఓవెన్‌ను 175 లేక 350 డిగ్రీలో వేడి చేయాలి. ఒక గిన్నెలో గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరం ముక్కలు, పంచదార అరకప్పు నీళ్ళు కలిపి స్లో ఫ్లేమ్‌పై ఉడకనివ్వాలి. చిక్కగా మెత్తటి మిశ్రమం అయ్యే వరకూ ఒక 15 నిమిషాలు పాటు ఉడకనిచ్చి దించేసి పక్కన పెట్టుకోవాలి. మ‌రో బౌల్‌లో పంచదార, వెన్నని మెత్తగా క్రీంలాగా తయారు చేసుకోవాలి. మైదా, బేకింగ్‌సోడా, ఉప్పు, కూడా వేసి బాగా కలపాలి.


ఇప్పుడు ఓట్స్‌ 3 లేక 4 స్పూన్లు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమం చపాతీ పిండిలాగా తయారు చేసి నానపెట్టి, తీసిన తర్వాత చపాతీలాగా గుండ్రంగా వత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని కుకీస్‌లాగా కట్‌ చేసుకొని ఒక షీటుపై పెట్టుకోవాలి. తర్వాత వాటిపై ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఖర్జూరపు మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ఒవెన్‌లో పెట్టి 15 నిమిషాలు పాటు బేక్‌ చేస్తే స‌రిపోతుంది. అంతే ఓట్స్ బిస్కె‌ట్లు రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: