కావాల్సిన‌ పదార్థాలు:
ఉడికించిన బంగాళదుంపలు - 2
ఉడికించిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ - టీ స్పూను
ఎండుమామిడి పొడి - 2 టేబుల్‌ స్పూన్లు


మొక్కజొన్న పిండి - టేబుల్‌స్పూను
బ్రెడ్‌పొడి - 4 టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీర- కొద్దిగా
బ్రెడ్‌ ముక్కలు- 2
పనీర్‌ - 50 గ్రాములు


ఉప్పు - రుచికి తగినంత
నూనె- సరిపడా
చాట్‌ మసాలా - టీ స్పూను
కారం - అర స్పూను


తయారీ విధానం:
ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని స్మాష్ చేసి అందులో పనీర్‌, బ్రెడ్‌ ముక్కల్ని, ఉడికించిన మొక్కజొన్న గింజల్ని వేసి ముద్దలా తయారుచేసుకోవాలి. అలాగే మొక్క‌జొన్న పిండి, త‌గ‌నంత ఉప్పు, చాట్ మ‌సాలా ఇలా అన్నీ  పదార్థాలన్నీ కూడా వేసుకుని బాగా క‌లుపుకోవాలి.


ఆ త‌ర్వాత‌  మీకు ఇష్టమైన ఆకారంలో కట్‌లెట్స్‌ తయారుచేసుకొని, బ్రెడ్‌పొడిని రెండు వైపులా అద్దాలి. వీటిని పెనంపై గోల్డ్‌రంగు వచ్చేవరకూ వేయించాలి.  కట్‌లెట్‌లోని పదార్థాలన్నీ ఉడకాలి కాబట్టి స్లో ఫ్లేమ్‌పై వేయించడం మంచిది. అంతే రుచిక‌ర‌మైన కట్‌లెట్స్ రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: