కావాల్సిన పదార్థాలు:
చేప ముక్కలు- 1 కేజీ
కొబ్బరిపొడి : 2 స్పూన్లు
జీలకర్ర పొడి : 1 స్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : 1స్పూన్‌


చింతపండు పులుసు : 2 స్పూన్లు
నూనె : వేయించడానికి సరిపడా
నిమ్మకాయ : 1
కారం పొడి : 1 స్పూన్‌


ధనియాల పొడి : 2 స్పూన్లు
మెంతిపొడి- పావు టేబుల్‌ స్పూన్‌
పసుపు- పావు స్పూన్‌
ఉప్పు : సరిపడా


తయారీ విధానం:
ముందుగా చేప‌ల‌ను శుభ్రం చేసి వెడల్పుగా కావాల్సిన‌ సైజ్‌లో కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు వాటికి నిమ్మరసం వేసి ముక్కలన్నింటికి పట్టించాలి. ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, కొబ్బరి పొడి, చింతపండు పులుసు, చెంచాడు నూనె వేసి బాగా కలపాలి. 


ఈ మిశ్రమాన్నంతటినీ ఒక ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు రెండువైపులా పట్టించాలి. ఈ ముక్కలను గంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత‌ పెనం వేడి చేసి కొద్ది కొద్దిగా నూనె వేస్తూ చేప ముక్క‌ల‌ని రెండువైపులా ఎర్రగా కాల్చాలి. నిదానంగా కాలిస్తే ముక్కలు లోపలి వరకు ఉడుకుతాయి. ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా చేప‌ల ఫ్రై రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: