కావాల్సిన ప‌దార్థాలు:
పచ్చికొబ్బరి తురుము- ఒక‌ కప్పు
యాపిల్‌- ఒకటి
చిక్కనిపాలు- ఒక క‌ప్పు

 

పంచ‌దార‌- ఒక క‌ప్పు 
నెయ్యి - రెండు చెంచాలు
యాలకుల పొడి - అరచెంచా 

 

జీడిప‌ప్పు- కొద్దిగా
బాదం ప‌ప్పు- కొద్దిగా
కిస్‌మిస్- ఒక స్పూన్‌

 

త‌యారీ విధానం:
ముందుగా మందపాటి గిన్నెలో పాలు, చక్కెర, యాపిల్‌ తురుము వేసి కలిపి ఆ గిన్నెను స్టౌ మీద పెట్టి సన్నని సెగ మీద ప‌ది నిమిషాలు ఉడికించాలి. ఆ మిశ్రమం చిక్కబడేటప్పుడు డ్రైఫ్రూట్స్‌ పలుకులు, చెంచా నెయ్యి కలిపి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి మరోసారి కలిపి మరో చెంచా నెయ్యి కలిపి ఐదు నిమిషాలు ఉడికించుకొంటే స‌రిపోతుంది.

 

అంతే వేడివేడి రుచికరమైన `కొబ్బరి, యాపిల్‌ హల్వా రెడీ. కావాలనుకునేవారు దీన్ని ఒక ప్లేట్‌లో వేసి ఆర‌నిచ్చి ముక్కలుగా కోసుకొని చివరలో మరికొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు చల్లి తిన‌వ‌చ్చు. ఆరోగ్యానికి యాపిల్ చేసే మేలు తెలిసిందే. పోషకాలపరంగా మేలైన కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక.. ఈ రెంటినీ కలిపి చేసే హల్వామంచి రుచి, తగినన్ని పోషకాలనూ అందిస్తుంది. సో.. త‌ప్ప‌క ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: