కావాల్సిన ప‌దార్థాలు:
సజ్జ పిండి- పావు కేజి
బియ్యపు పిండి- రెండు స్పూన్లు
కరివేపాకు- కొద్దిగా

 

కొత్తిమీర- కొద్దిగా
ఉల్లిపాయలు- ఒక‌టి
శ‌న‌గ‌పిండి- మూడు స్పూన్లు

 

నూనె- స‌రిప‌డా
ఉప్పు- రుచికి స‌రిప‌డా
పచ్చిమిర్చి- మూడు

 

తయారీ విధానం:
ముందుగా శనగపిండి, సజ్జపిండి, బియ్యపు పిండి మూడు జల్లించి కలపాలి. త‌ర్వాత అందులోనే ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తగినంత నీళ్ళు పోసి పిండిని కొద్దిగా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని నూనె పోసి కాగిన తరువాత పిండిని చేతితో లేదా గరిటతో పకోడీల్లా వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

 

అంతే  క్రిస్పీ క్రిస్పీ సజ్జ పకోడీ రెడీ. వేడి వేడిగా వీటిని తింటే ఎంతో బాగుంటుంది. అయితే మొలకెత్తిన సజ్జలను తింటే బొజ్జ ఇట్టే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన సజ్జలను పిండి కొట్టుకొచ్చి పెట్టుకోవడం ఆ పిండితో జావ, లేదా రొట్టెలను కాల్చుకుని తీసుకోవడం చాలా మంచిది. మ‌రియు ఇలా పకోడీ వేసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: