కావాల్సిప పదార్థాలు:
బీట్రూట్ తురుము- రెండు కప్పులు
మైదా- రెండు కప్పులు
ఎండుకొబ్బరి తురుము- ఒక కప్పు
కార్న్ ఫ్లోర్- ఒకటిన్నర కప్పు
నెయ్యి- నాలుగు టీ స్పూన్లు
నూనె- వేగించడానికి సరిపడా
యాలకుల పొడి- పావు టీ స్పూన్
జీడిపప్పు పొడి- పావు కప్పు
పంచదార- ఒక కప్పు
బెల్లం తురుము- ఒక కప్పు
తేనె- ఆరు టీ స్పూన్లు
తయారి విధానం:
ముందుగా బీట్రూట్లో కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్‌చేసి రసం తీసి, ఈ రసాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్, కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి, తేనె, నెయ్యి వేసి తగినంత బీట్రూట్ రసంతో ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టిన తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఉండల్ని గవ్వల పీటపై గవ్వల్లా చేసుకొని నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. మరో పాత్రలో బెల్లం, పంచదార మిగిలిన బీట్రూట్ రసం, యాలకుల పొడి వేసి పాకం వచ్చాక.. వేగిన గవ్వలు వేయాలి. గవ్వలకు పాకం బాగా పట్టాక తీసి ఆరబెట్టుకోవాలి. అంతే ఎంతో సులువుగా బీట్రూట్ గవ్వలు రెడీ.