కావాల్సిన ప‌దార్థాలు:
మటన్‌- ఆర‌కేజీ
దోసకాయ- ఒకటి
టొమాటో- ఒకటి
పసుపు- అర టీ స్పూన్‌

 

కొత్తిమీర- కొద్దిగా
ఉల్లిపాయ- రెండు
పచ్చిమిర్చి- రెండు

 

అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్
నూనె- రెండు టీ స్పూన్‌లు
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కారం- ఒక టీస్పూన్

 

త‌యారీ విధానం: 
ముందుగా దోసకాయ పొట్టు తీసి రెండు ముక్కలుగా కట్‌ చేసుకుని విత్తనాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్క‌లు, పచ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించుకోవాలి. తర్వాత‌ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి మరి కాసేపు వేయించాలి. ఇప్పుడు మటన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి అందులో వేయాలి. 

 

ఓ పావు గంట పాటు చిన్న మంటపై మ‌గ్గ‌నివ్వాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడ‌క‌నివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి మరి కాసేపు వేయించాలి. కారం, ఉప్పు,  అర కప్పు నీళ్లు పోసి గ్రేవి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడ‌క‌నివ్వాలి. చివ‌రిగా కొత్తిమీర కూడా వేపి క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో టేస్టీ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: