కావాల్సిన ప‌దార్థాలు:
బంగాళా దుంపలు- పావుకిలో
పసుపు- పావు టీ స్పూన్‌
తాలింపు గింజలు- అరస్పూన్ చ‌ప్పున‌
అల్లం వెల్లుల్లి మిశ్రమం- అర టీ స్పూన్‌

 

కరివేపాకు- రెండు రెబ్బ‌లు
ఉల్లిపాయ తరుగు- రెండు
పచ్చిమిర్చి- మూడు

 

కొత్తిమీర తరుగు- కొద్దిగా
నూనె- త‌గినంత‌
మిరియాల పొడి- అర చెంచా
ఉప్పు- రుచికి తగినంత

 

త‌యారీ విధానం: ముందుగా తొక్క‌ తీసిన బంగాళా దుంపలను పెద్ద పెద్ద ముక్కలుగా క‌ట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి తాలింపు గింజలు, కరివేపాకు వేసి తర్వాత ఉల్లి తరుగు వేసి మగ్గే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో పసుపు,  పచ్చిమిర్చి వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కలిపి అందులో బంగాళా దుంప ముక్కలు, తగినంత ఉప్పువేసి బాగా కలిపి మూత పెట్టాలి. 

 

ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి మ‌రికాస్త సేపు ఉడికించాలి. ముక్క ఉడికిన తర్వాత గరిటతో కాస్త మెదిపి దానిపై మిరియాల పొడి చల్లి కలిపి ఓ ఐడు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు చల్లి స్టౌ చేయాలి. దింపేయాలి. అంతే వేడి వేడి ఆలూ పెప్పర్ కర్రీ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: