కావాల్సిన ప‌దార్థాలు:
నువ్వులు- ఒక‌ కప్పు
బెల్లం తురుము- కప్పున్నర
నెయ్యి- మూడు చెంచాలు

 

యాలకుల పొడి- అర చెంచాడు
జీడి పప్పు- కొద్దిగా
బాదం ప‌ప్పు- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా నువ్వుల్ని జల్లెడ పట్టి, సన్నని సెగ మీద పాన్‌లో వేయించుకుని, దించి చల్లారనివ్వాలి. అలాగే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడి ప‌ప్పు, బాదం ప‌ప్పు వేయించుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు, బెల్లం తరుగు, యాలకుల పొడి, బాదం ప‌ప్పు, జీడి ప‌ప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.

 

ఇప్పుడు మ‌న‌కు న‌చ్చిన సైజ్‌లో తీసుకొని నెయ్యి అద్దుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఇలా చేసిన ఉండలను రోజుకొకటి చొప్పున తింటే కఫదోషాలు తొలగి పోవటమే గాక సరిపడా ఐరన్ లభిస్తుంది. నువ్వుల్లోని అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, మాంసకృత్తులు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నువ్వులు వాడకం వల్ల రక్తపోటు, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

 

నువ్వుల్లోని మోనో సాచురేటేడ్ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. కేశ, చర్మ సంరక్షణలో  నువ్వులది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో.. అప్పుడ‌ప్పుడు ఇలా నువ్వుల ఉండ‌లు చేసుకుని తిన‌డం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: