కావాల్సిన ప‌దార్థాలు:
లావు మిర్చీలు- ఎనిమిది
బంగాళదుంపలు- నాలుగు
శనగపిండి- 150 గ్రా
వాము- అర టీ స్పూన్‌

 

జీరాపొడి- అర టీ స్పూన్‌
ఎండు మామిడిపొడి-  అర టీ స్పూన్‌
నూనె- వేగించడానికి సరిపడా

 

కారం- ఒక టీ స్పూన్
ఉప్పు- రుచికి తగినంత
నిమ్మ‌కాయ‌- ఒక‌టి
ఉల్లిపాయ- ఒక‌టి

 

తయారీ విధానం: ముందుగా బంగాళదుంపల‌ను ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటిని తొక్కతీసి మెదిపి.. అందులో కారం, జీరాపొడి, మామిడి పొడి వేసి బాగా కలిపి ముద్దలా చేసి ప‌క్క‌న‌పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చీలను నిలువునా మధ్యలోకి చీల్చి, గింజల్ని తీసేసి అందులో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టాలి. ఆ త‌ర్వాత శనగపిండిలో ఉప్పు, వాము వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. 

 

మ‌రోవైపు స్టౌ ఆన్ చేసి క‌డాయి పెట్టుకుని నూనె పోసి కాగ‌నివ్వాలి. ఇప్పుడు మిర్చీలను శనగపిండి జారులో ముంచి ఓ మోస్తరు వేడి నూనెలో వేసి దోరగా వేగించుకోవాలి. అవి వేగాక స‌ర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్క‌లు మ‌రియు నిమ్మ‌కాయ ర‌సంతో గ‌ర్నింష్ చేసుకుని తిన‌వ‌చ్చు. ఇష్టం ఉన్నవారు పుదీనా చట్నీతో కూడా తినవచ్చు. అంతే వేడి వేడి ఆలూ మిర్చి బ‌జ్జీ రెడీ..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: