కావాల్సిన ప‌దార్థాలు:
క్యాప్సికం- అర కిలో
సెనగపప్పు- ఐదు స్పూన్లు
మెంతులు- ఒకటిన్నర స్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బలు

 

పసుపు- అర టీ స్పూన్‌
మిన‌పప్పు- ఐదు స్నూన్లు
ఆవాలు- నాలుగు స్పూన్లు

 

ఇంగువ- అర టీ స్పూన్‌
చింతపండు- కొద్దిగా
ఉప్పు- తగినంత 
ఎండుమిరపకాయలు- ఐదు

 

తయారీ విధానం:
ముందు ఒక పాన్‌లో నూనె పోసి కాగాక కొద్దిగా ఆవాలు,  సెనగపప్పు, మినపపప్పు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి. త‌ర్వాత కరివేపాకు, ఇంగువ వేసి వేగించి వేరే పాత్రలోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. ప‌క్క‌న పెట్టుకుని చ‌ల్లార‌నివ్వాలి.

 

ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె పోసి కాగాక క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేయించి చల్లార్చాలి. ఇప్పుడు చ‌ల్లార్చుకున్న తాలింపు మిశ్ర‌మం, క్యాప్సికం ముక్కలు, నానబెట్టిన చింతపండు, ఉప్పు మిక్సీలో వేసి చట్నీ చేయాలి. చివ‌రిగా దీనికి మొదట తయారు చేసిన తాలింపు కలిపితే స‌రిపోతుంది. అంటే టేస్టీ టేస్టీ క్యాప్సికం చట్నీ రెడీ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: