కావాల్సిన పదార్థాలు: 
సొరచేప- అరకేజి
పచ్చిమామిడి ముక్కలు- అర‌ కప్పు
కరివేపాకు- నాలుగు రెబ్బలు

 

దనియాలపొడి- అర టీ స్పూను
మిరియాలపొడి- పావు టీ స్పూను
ఎండుకొబ్బరి తురుము- ఒక‌ కప్పు

 

ఉల్లిపాయ తరుగు- పావు కప్పు
ఉప్పు- రుచికి స‌రిప‌డా
పసుపు- చిటికెడు
కొత్తిమీర‌- కొద్దిగా

 

తయారీ విధానం: ముందుగా చేపని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని, నీటితో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న‌పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఉల్లితరుగు,  కరివేపాకు, ధనియాలపొడి, మిరియాలపొడి, పసుపును అరకప్పు నీటితో పేస్టులా గ్రైండు చేసుకోవాలి. ఆ త‌ర్వాత కడాయిలో పేస్టుని వేసి కొద్దిగానీరు, చేపముక్కలు వేసి ఉడికించాలి. 

 

చేప సగం ఉడికిన తర్వాత మామిడి ముక్కలు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సన్నని మంటమీద ఉడికించి చివ‌రిగా కొత్తిమీరు వేసి స్టౌ ఆఫ్ చేసేయాలి. నూనెలేకుండా చేసుకునే ఈ చేపలకూర వేడి వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.


 
  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: