పచ్చడిలలో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ మనం కొన్ని రకాల పచ్చడులు మాత్రమే తింటాం. కారణం మిగితా కొత్త రకాల పచ్చడులు ఎప్పుడు రుచి చూడము కూడా.. అయితే మారుతున్న కాలం బట్టి మనం తినే వంటకాలు కూడా మారుతుంటాయి.. అలానే ఈ కొత్తిమీర పచ్చడి కూడా చాలా తక్కువ మందికి తెలుసు.. అలాంటి ఈ పచ్చడిని ఇంకా చెయ్యడం ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

కొత్తిమీర కట్టలు - రెండు పెద్దవి, 

 

పచ్చిమిర్చి - రెండు, 

 

ఎండు మిర్చి - రెండు, 

 

సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, 

 

మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, 

 

జీలకర్ర - అర టీస్పూన్‌, 

 

చింతపండు - కొద్దిగా, 

 

పంచదార లేదా బెల్లం - కొద్దిగా, 

 

ఉప్పు - రుచికి సరిపడా, 

 

నూనె - తగినంత, 

 

ఆవాలు - ఒక టీస్పూన్‌, 

 

కరివేపాకు - ఒక కట్ట.


 
తయారీ విధానం... 


 
ఒక కడాయిలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్నాక ఎండు మిర్చి, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేగించాలి. రెండు, మూడు నిమిషాల పాటు వేగాక పాన్‌లో నుంచి ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో కొత్తిమీర, పచ్చి మిర్చి వేసి వేగించాలి. ఇప్పుడు వేగించిన పప్పులు, చింతపండు తీసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత పచిమిర్చి, కొత్తిమీర వేసి మరొకసారి గ్రైండ్‌ చేయాలి. కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్టులా కలపాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేగించాలి. దాన్ని గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసి కలపాలి. అంతే.. కొత్తిమీర చట్నీ రెడీ. ఈ చట్నీని దోస.. ఇడ్లీ.. పూరిలోకి వేసుకొని తింటే ఆహా అనకుండా ఉండలేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: