పెరుగు శాండ్‌విచ్‌.. ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆరోగ్యకరమైన ఈ పెరుగు శాండ్‌విచ్‌ను ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లోనే చేసి పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లా ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. 

 

కావాల్సిన పదార్థాలు.. 

 

బ్రెడ్‌ ముక్కలు - నాలుగు, 

 

పెరుగు - పావు కప్పు, 

 

క్యాప్సికం - రెండు, 

 

ఉల్లిపాయ - ఒకటి, 

 

క్యాబేజీ - కొద్దిగా, 

 

మిరియాల పొడి - అర టీస్పూన్‌, 

 

వెన్న - టీస్పూన్‌, 

 

కొత్తిమీర - కొద్దిగా, 

 

ఎండు మిర్చి - ఒకటి.

 

తయారీ విధానం.. 

 

ఫ్రిజ్‌లో పెరుగును అరగంట పాటు పెట్టాలి. ఆతర్వాత పెరుగులో నీళ్లు లేకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. క్యాప్సికం, ఉల్లిపాయ, క్యాబేజీ, కొత్తిమీరను కట్‌ చేసి ఎండుమిర్చిని పొడిపొడిగా చేయాలి. వాటిని పెరుగులో వేసి కలిపి పక్కన పెట్టాలి. బ్రెడ్‌ ముక్కలు తీసుకుని వెన్న రాసి ఆతరువాత బ్రెడ్‌పై పెరుగు మిశ్రమం వేసి, పైన మరొక బ్రెడ్‌ పెట్టాలి. అంతే ఆరోగ్యాన్ని పెంచే పెరుగు శాండ్‌విచ్‌ రెడీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: