కావాల్సిన ప‌దార్థాలు: 
బోటి- అరకేజీ
చింతచిగురు- అర క‌ప్పు
నూనె- మూడు టీస్పూన్లు
కారం- ఒక టీస్పూన్‌

 

పసుపు- చిటికెడు
ఉల్లిపాయలు- రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- ఒర టీస్పూన్‌
ఉప్పు- రుచికి తగినంత

 

పచ్చిమిర్చి- నాలుగు
గరంమసాల- ఒక‌ టీస్పూన్‌
కరివేపాకు- నాలుగు రెబ్బ‌లు
కొత్తిమీర- కొద్దిగా

 

త‌యారీ విధానం: 
ముందుగా బోటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కుక్కర్‌లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. త‌ర్వాత చింతచిగురును క‌డిగి పేస్టు మాదిరిగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరగిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగాక కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి వేసుకొని వేగించాలి.

 

ఇప్పుడు ఉడికించుకున్న బోటిని వేసి కలియబెట్టుకోవాలి. కాసేపయ్యాక అల్లం పేస్టు వే, కారం, గరంమసాలా, కరివేపాకు వేసి బాగా క‌లిపి ఉడ‌క‌నివ్వాలి. ఇప్పుడు చింతచిగురు పేస్టును కూడా ఐదు ప‌ది నిమిషాలు ఉడికించాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ చింతచిగురు బోటి రెడీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: