కావాల్సిన ప‌దార్థాలు:
ట‌మాటోలు- నాలుగు
కారం- రెండు స్పూన్లు
ఉప్పు- తగినంత
పెరుగు- ముప్పావుకప్పు 

 

పసుపు- అర టీ స్పూన్‌
గరంమసాలా పొడి- ఒక స్పూన్‌
అల్లం వెల్లుల్లిపేస్టు- ఒక టీ స్పూన్‌
సెనగపిండి- కొద్దిగా

 

ఉల్లిపాయలు- రెండు
కొత్తిమీర- కొద్దిగా
వేయించిన పల్లీలు- అరకప్పు
గసగసాలు- రెండు టీ స్పూన్లు

 

త‌యారీ విధానం: ముందుగా పెరుగులో పసుపు, కారం, అలం వెల్లుల్లి పేస్ట్‌, సెనగపిండి, గరంమసాలాపొడి, ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ట‌మాటోలకు అక్కడక్కడా గాట్లు పెట్టి పెరుగులో వేసి కనీసం అరగంట వదిలేయాలి. ఇప్పుడు పల్లీలూ, గసగసాలను మిక్సీలో తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ మెత్తని మిశ్రమంలా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. 

 

ఇప్పుడు స్టై మీద పాన్‌ పెట్టి నూనెను వేడిచేసి ఉల్లిపాయముక్కల్ని వేయించాలి. ఆ తరవాత పెరుగులో వేసిన ట‌మాటోలను అందులో వేసి వేయించాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గాక పెరుగు వేయాలి. అది దగ్గరకు అయి గ్రేవీలా తయారయ్యాక పల్లీల మిశ్రమం వేసి కలపాలి. అది కూడా వేగాక కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: