కావాల్సిన ప‌దార్థాలు:
సపోట పండ్లు- ఐదు
పాలు- ఒక‌ లీటరు

 

పంచదార- అర క‌ప్పు
కుంకుమపువ్వు- చిటికెడు
డ్రై ఫ్రూట్స్‌- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో పాలను పోసి స్లో ఫ్లేమ్‌పై పాలు సగానికి సగం అయ్యేలా మరిగించాలి. ఈ లోపు సపోటాలని తొక్క తీసి పొడవుగా ముక్కలుగా కోసుకొని గింజల్ని కూడా తీసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు సగం అయ్యాక అందులో పంచదారని కలిపి మొత్తం కరిగేదాకా తిప్పాలి. తర్వాత సపోటా పళ్ల ముక్కల్ని వేసి మరో రెండు మూడు నిమిషాలు స్టౌ పైనే ఉంచాలి. 

 

సపోటాలు చిన్న చిన్న ముక్కలు కాకుండా చూసుకోవాలి. దించాక ఈ ఖీర్‌ను కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సపోటా ఖీర్‌ రెడీ. అయితే దీనిని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తింటే మ‌రింత‌ య‌మ్మీ య‌మ్మీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: