కావాల్సిన ప‌దార్థాలు:
గోధుమ పిండి- రెండు క‌ప్పులు
పిజ్జా సాస్‌- ఒక‌టిన్న‌ర స్పూన్లు
పన్నీర్‌ ముక్కలు- ఒక కప్పు
మిరియాల పొడి- అర టీ స్పూన్‌
ఉప్పు- త‌గినంత‌

 

నూనె- సరిపడ
తులసి ఆకులు- నాలుగు
మెజెరెల్లా చీజ్‌- కొద్దిగా
పాలు- అర క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా గోధుమ పిండిలో పాలు వేసి మెత్తగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను రెండు భాగాలుగా చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి. ఈ పరోటా మీద పిజ్జా సాస్‌ వేసి స్ప్రెడ్ చేయాలి. తర్వాత పన్నీర్‌, మోజెరెల్లా వెయ్యాలి.

 

ఇప్పుడు త‌గినంత ఉప్పు, క‌ట్ చేసిన తులసి ఆకులు, మిరియాల పొడి చల్లి అంచులు నీళ్లతో తడి చేసుకోవాలి. దీని మీద మరో పరోటా ఉంచి అంచులు మూసేయాలి. పెనం మీద నూనె వేసి ఈ పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పిజ్జా రెడీ.


 

మరింత సమాచారం తెలుసుకోండి: