కావాల్సిన ప‌దార్థాలు: 
శనగపిండి- అర‌ కప్పు
మామిడికాయ- ఒక‌టి
ఉల్లి పాయ ముక్క‌లు- ఒక క‌ప్పు

 

బంగాళాదుంప- ఒక‌టి
అల్లం ముక్క‌- చిన్న‌ది
పచ్చిమిరప కాయ- మూడు 

 

ఉప్పు- రుచికి సరిపడా
నూనె- స‌రిప‌డా
కారం- అర టీ స్పూన్‌
కొత్తిమీర- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా ఎక్కువ పులుపు లేని మామిడికాయ తీసుకుని తొక్క తీయాలి. త‌ర్వాత నీటిలో శుభ్రంగా క‌డిలి తురుముకోవాలి. మ‌రియు బంగాళాదుంప‌ని సైతం తురుముకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, ఉప్పు, కారం, మామిడి తురుము, బంగాళాదుంప తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్క‌లు, కొత్తి మీర తరుగు వేసి నీళ్లు సాయం క‌లుపుకోవాలి.

 

పిండిని బాగా జోరుగా కాకుండా  పకోడీలు వేయడానికి అనువుగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్‌ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేయాలి. నూనె వేడెక్కాక పకోడీల్లా వేసుకోవాలి. గోల్డెన్ క‌ల‌ర్‌ వచ్చేవరకు వేయించుకుని తీసి ప్లేటులో పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పకోడీ రెడీ. వీటిని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: