కావాల్సిన ప‌దార్థాలు: 
మైదా పిండి- ఒక క‌ప్పు
షుగర్- అర క‌ప్పు
ఉప్పు- చిటికెడు
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు

 

యాలికులు పొడి- పావు టీ స్పూన్‌
పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా- పావు టేబుల్ స్పూన్‌
నీరు- త‌గినంత‌
డ్రై ఫ్రూట్స్‌- కావాల్సిన‌న్ని

 

త‌యారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో కాస్త నెయ్యి, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు మైదాని వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమం మొత్తం మెత్తగా చేతికి అంటుకోకుండా ఉండేంతవరకు నీటి సాయంతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనుండి కొంత భాగాన్ని తీసుకొని మీ అరచేతులతో పిండిని గుండ్రంగా చేయండి. ఇప్పుడు దానిని నెమ్మ‌దిగా ఒత్తుకుంటూ బాదుషా షేప్ లో చేసుకోవాలి. 

 

తర్వాత స్టౌ మీద‌ పాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక బాదుషాలను ఒక్కొక్కటిగా వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ లో చక్కెర, తగినంత నీటిని పోసి పాకం వచ్చేవరకు తిప్పుతూ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.  త‌ర్వాత పాకంలో బాదుషాలను వేసి అర గంట పాటు ఉంచి తర్వాత సర్వ్ చేసి.. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ బాదుషా రెడీ. 

 

కాగా, చాలా మంది బాదుషా స్వీట్‌ని ఇష్ట‌ప‌డ‌తారు. ఈ క్ర‌మంలోనే బ‌య‌ట కొనుగోలు చేసి ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే.. ఇంట్లో దీన్ని ఎలా చేయాలో తెలియ‌క బ‌య‌టే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ టైమ్ న‌డుస్తుంది. బ‌య‌ట కాలు పెడితే.. పోలీసులు లాటీలు ప‌డుతున్నారు. కాబ‌ట్టి.. బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. పైన చెప్పిన విధంగా ఇంట్లో మీకు ఇష్ట‌మైన య‌మ్మీ య‌మ్మీ బాదుషా త‌యారుచేసుకుని.. తినండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: