కావాల్సిన ప‌దార్థాలు
ఎగ్స్‌- ఐదు
క‌రివేపాకు- నాలుగు రెబ్బ‌లు
గ‌రం మ‌సాలా- ఒక‌టిన్న‌ర టీ స్పూన్‌
జీల‌క‌ర్ర పొడి- ఒక‌టిన్న‌ర‌ టీ స్పూన్‌

 

అల్లం ముక్క‌- చిన్న‌ది
వెల్లుల్లి- ఐదు రెబ్బ‌లు
ప‌చ్చిమిర్చి-  మూడు
కొత్తిమీర- ఒక క‌ట్ట‌
బ్రెడ్ ప్రౌడ‌ర్- రెండు టీ స్పూన్లు

 

కారం- ఒక‌ టేబుల్ స్పూన్
ఉప్పు- రుచికి త‌గినంత‌
చిల్లీ సాస్- అర టీ స్పూన్‌
పంచ‌దార- ఒక‌ టీ స్పూన్లు
కార్న్ ఫ్లోర్- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా ఎగ్సీను తీసుకుని ఉడ‌క‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌లో ఉండే ప‌చ్చసొన తీసేసి తెల్ల సొన మాత్ర‌మే తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్క‌ల్లో స‌న్న‌గా త‌రిగిన‌ అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, కొద్దిగా కారం, గ‌రం మ‌సాలా, బ్రెడ్ ప్రౌడ‌ర్‌, కార్న్ ఫ్లోర్, త‌గినంత ఉప్పు వేసి క‌లిపి పెట్టుకోవాలి. 

 

ఇప్పుడు రెండు కోడిగుడ్లను ప‌గ‌ల‌గొట్టి వాటిల్లో నుంచి తెల్లసొన తీసి ఆ మిశ్ర‌మం బాగా క‌లిపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక అందులో ఎగ్ ముక్కలను వేసి వాటిని బంగారు రంగు వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. ఇప్పుడు మ‌రో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి కాగానే అందులో స‌న్న‌గా తరిగిన అల్లం, వెల్లుల్లి, ప‌చ్చిమిర‌పకాయ ముక్క‌లు, క‌రివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించాలి. 

 

ఆ త‌ర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలను వేయాలి. హై ఫ్లేమ్‌పై ముక్క‌ల‌కు గ్రేవీ బాగా ప‌ట్టేవ‌ర‌కు ప్యాన్‌ను అటు ఇటు తిప్పాలి. బాగా ఉడికిన త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంటే ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ 65 రెడీ అయిన‌ట్లే. ఈ రెసిపీని పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాబ‌ట్టి ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ 65 ను పైన చెప్పిన విధంగా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: